
Kannada Actor Satyajith Passes Away: ప్రముఖ కన్నడ సినీ నటుడు సత్యజిత్ (72) ఆదివారం తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. ఆయన కన్నడంలో ఆరు వందలపైగా సినిమాలలో నటించారు. ఇటీవల కాలికి గాయమై గ్యాంగ్రిన్‌తో చికిత్స పొందుతుండగా గుండెపోటు వచ్చింది.
ఆయన అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్ సత్యజిత్. 10వ తరగతి వరకు చదివిన ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. 1986లో అరుణరాగ సినిమా ద్వారా కన్నడ చిత్రరంగంలో అడుగుపెట్టారు. విలన్ పాత్రల్లోనూ ప్రేక్షకుల్ని మెప్పించారు. సత్యజిత్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment