బెంజ్‌ కారు బీభత్సం.. వాయువేగంతో దూసుకెళ్లి.. | Mercedes Benz Car Accident One Deceased Several Injured In Bangalore | Sakshi
Sakshi News home page

బెంజ్‌ కారు బీభత్సం.. వాయువేగంతో దూసుకెళ్లి..

Published Wed, Dec 8 2021 9:04 PM | Last Updated on Wed, Dec 8 2021 9:13 PM

Mercedes Benz Car Accident One Deceased Several Injured In Bangalore - Sakshi

బనశంకరి(బెంగళూరు): వాయువేగంతో దూసుకువచ్చిన బెంజ్‌కారు అదుపుతప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం హలసూరు పరిధిలో జరిగింది. నందితా చౌదరి అనే మహిళ కారు నడుపుతూ అదుపుతప్పి వేగంగా జనాల మీదకు దూసుకెళ్లింది.

ముందు వెళ్తున్న రెండుకార్లు, ఆటో, టాటా ఏస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహంత (35) అనేవ్యక్తి మృతిచెందగా నలుగురు గాయపడ్డారు.  బెంజ్‌ కారు కూడా నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని స్దానిక ఆసుపత్రికి తరలించారు. హలసూరు ట్రాఫిక్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి.. మూడు రోజులుగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement