
సాక్షి, హైదరాబాద్: ఓ బాలుడు ఆత్మహత్య బహదూర్‌పురాలో కలకలం రేపింది. వారం రోజుల క్రితం గుండెపోటు రావడంతో తనవాళ్లకు చెబితే భయపడతారని ఆందోళన చెందిన ఆ బాలుడు మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదో తరగతి పూర్తిచేసిన ఆ బాలుడు. చనిపోయే ముందు తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాశాడు. ‘‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి.. నేను మిమ్మలి వదిలి వెళ్తున్నాను. నన్ను మర్చిపోండి.. నా ఫొన్ అమ్మి నా అంత్యక్రియలు నిర్వహించండి. అప్పుడే నా ఆత్మకు శాంతి జరుగుతుందంటూ’ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment