సాక్షి, హైదరాబాద్: మహిళలు, యువతులను వేధిస్తోన్న ఓ పోకిరిని బాధితుల బంధువులు పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో పనిచేసే సికిందర్(26) గంజాయికి బానిసయ్యాడు.
డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వచ్చే మహిళలు, యువతుల ఫోన్ నంబర్లు తీసుకుని.. వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలతో వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేని కొందరు మహిళలు వారి బంధువులకు తెలపడంతో పోకిరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గాయపడిన సికిందర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: ప్రియురాలి నిర్వాకం.. ప్రియుడిపై కోపంతో సినిమా తరహా పక్కా స్కెచ్
Comments
Please login to add a commentAdd a comment