విషాదం: అందరూ చూస్తుండగానే.. షాపింగ్‌మాల్‌లో షాకింగ్‌ వీడియో | Shopping Mall Employee Dies Of Heart Attack In Khammam | Sakshi
Sakshi News home page

విషాదం: అందరూ చూస్తుండగానే.. షాపింగ్‌మాల్‌లో షాకింగ్‌ వీడియో

Published Sat, Oct 16 2021 5:16 PM | Last Updated on Sat, Oct 16 2021 8:34 PM

Shopping Mall Employee Dies Of Heart Attack In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం జిల్లా: నగరంలో విషాదంలో చోటుచేసుకుంది. ఓ షాపింగ్‌ మాల్‌లో ఉద్యోగి.. కస్టమర్‌కు బట్టలు చూపిస్తుండగా, గుండెపోటు రావడంతో ఒక్కసారిగా టేబుల్‌పైనే కూప్పకూలిపోయాడు. ఖమ్మం నగరానికి చెందిన చాంద్ పాషా గత కొద్దికాలంగా  కేఎల్‌ఎం షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్నాడు. రోజువారి పనిలో భాగంగా కస్టమర్‌కు బట్టలు చూపిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి దాకా మాట్లాడిన ఉద్యోగి.. అంతలోనే మృతి చెందడంతో ఉద్యోగులు, కస్టమర్లు షాక్‌కు గురయ్యారు.

చదవండి: ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement