కాబూల్: ఆదివారం పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో జరిగిన పోరాటంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న బృందంలో కీలక వ్యక్తి మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతి చెందిన వ్యక్తి.. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి ఫాహిమ్ దాష్టీ, జమియత్-ఇ-ఇస్లామీ పార్టీ సీనియర్ సభ్యుడు, ఆఫ్ఘన్ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడిగా గుర్తించారు. పంజ్‌షీర్ లోయ హిందూ కుష్ పర్వతాలలో, కాబూల్‌కు ఉత్తరాన దాదాపు 90 మైళ్ల దూరంలో ఉంది.
నెలరోజుల వ్యవధిలో ప్రభుత్వ అనుకూల దళాలలో ఈ ప్రాంతంలో ఉక్కుపాదం మోపిన తరువాత తాలిబాన్లతో వారు పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం లోయ త్వరలో కూలిపోవచ్చని నివేదికలు చెప్తున్నాయి. అయితే,ఆఫ్గన్ దళాలు మాత్రం అటువంటి వాదనలను ఖండించాయి. దళాల నాయకుడు అహ్మద్ మసౌద్ ఆదివారం మాట్లాడుతూ.. తాలిబాన్లు ప్రావిన్స్‌ని విడిచిపెడితే తాము పోరాటం ఆపడానికి, చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ తాలిబన్లతో విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉందని మిస్టర్ మసౌద్ అన్నారు.
చదవండి: Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్‌పై పట్టు చిక్కేనా?
Comments
Please login to add a commentAdd a comment