Panjshir
-
Afghanistan: తాలిబన్ల పంట పండింది
ఆర్థికంగా ముప్పావు భాగం మునిగిన అఫ్గన్ నావను నడిపేందుకు తాలిబన్లకు ఇప్పుడు ఆసరా అవసరం. ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) సైతం అఫ్గనిస్తాన్‌కు ఆపన్నహస్తం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈలోపు తమ వనరులను సమీకరించుకునే పనిలో పడ్డారు తాలిబన్లు. ఈ క్రమంలోనే పాత ప్రభుత్వంలోని మంత్రులు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అమ్రుల్లా సలేహ్.. అఫ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు. మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన తర్వాత.. సలేహ్ తనను తాను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై తాలిబన్ల ఆక్రమణ తర్వాత అజ్ఞాతంలో ఉంటూ.. తాలిబన్లతో పోరాటం కొనసాగుతుందని ప్రకటించాడు కూడా. అయితే ఆయన ఇంట్లో తాలిబన్లు తాజాగా సోదాలు నిర్వహించారు. సుమారు 6 మిలియన్ల విలువ చేసే డాలర్లు(మన కరెన్సీలో 45 కోట్ల రూ. దాకా), 18 పెద్ద బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్ మల్టీమీడియా బ్రాంచ్ చీఫ్ అహ్మదుల్లా ముట్టాఖీ తన ట్విటర్లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. د امر الله صالې په کور کې شپږنیم میلیونه ډالر د سرو زرو له اتلس خښتو سره يوځای د اسلامي امارت د ځواکونو لاسته ولوېدل. pic.twitter.com/E5YinxvTe0 — Ahmadullah Muttaqi (@Ahmadmuttaqi01) September 13, 2021 ఇక సలేహ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా పని చేసిన మంత్రులు, అధికారులు, గత పాలనలో అవినీతికి పాల్పడ్డవాళ్ల ఇళ్లలోనూ తాలిబన్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా సోమ్ము సేకరించినట్లు తెలుస్తోంది. ఇక పరారీలో ఉన్న మరికొందరి దగ్గర సొమ్ము ఉండొచ్చని భావిస్తున్న తాలిబన్లు.. ఓ లిస్ట్ తయారు చేసుకుని వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే అఫ్గనిస్తాన్‌ను తాలిబనిస్తాన్‌గా మారడం తనకు ఇష్టం లేదని ప్రకటించుకున్న సలేహ్.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పంజ్‌షీర్‌కు పారిపోయాడు. అక్కడ ప్రతిఘటన దళాల నేత అహ్మద్ మస్సౌద్‌తో కలిసి పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో సలేమ్ సోదరుడు రుల్లాహ్‌ను బంధించి, చిత్రహింసలు పెట్టి మరీ చంపారు తాలిబన్లు. చదవండి: అఫ్గన్ థియేటర్ల మూత, బాలీవుడ్‌కు ఆర్థిక ముప్పు ఇక సెప్టెంబర్ 3న చివరిసారిగా పోరు కొనసాగుతుందని ప్రకటించిన సలేహ్.. సెప్టెంబర్ 6న పంజ్‌షీర్ తాలిబన్ల వశం అయ్యిందన్న ప్రకటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఆయన ప్రాణాలతోనే ఉన్నాడా? లేదా పరారీలో ఉన్నాడా? అనేది నిర్దారణ కావాల్సి ఉంది. చదవండి: తాలిబన్ ఎఫెక్ట్.. భారత్‌లో అలర్ట్ -
తాలిబన్ల అరాచకం.. అఫ్గన్ మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడి హత్య
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తాలిబన్లు తాము అఫ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడైన అమ్రుల్లా సాలెహ్ తమ్ముడు రోహుల్లా సాలెహ్ని హత్య చేసినట్లు ప్రకటించుకున్నారు. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాలిబన్లు పంజ్‌షీర్‌లో రోహుల్లా సాలెహ్‌ను హింసించి చంపినట్లు సమాచారం. ఈ దాడిలో తాలిబన్లు కూడా పెద్ద సంఖ్యలో మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. రోహుల్లా సాలెహ్ మృతి అనంతరం తాలిబన్లు అతడి లైబ్రరీని ఆక్రమించారని సమాచారం. గ్రంథాలయంలోకి ప్రవేశించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. (చదవండి: కొత్త కోణం: అఫ్గాన్ సింహాలు తలవంచేనా!) మూడు రోజుల క్రితం తాలిబన్లు తాము అఫ్గనిస్తాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పంజ్‌షీర్ నాయకులు తాలిబన్ల ప్రభుత్వాన్ని ఆమోదించలేదు. ఈ క్రమంలో పంజ్‌షీర్ ప్రాంత నాయకులు, మాజీ అఫ్గన్ పాలకులు ఉగ్రవాద అఫ్గన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి తొందరపడవద్దని తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌తో సహా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. తాలిబన్లు ఏర్పాటు చేసిన కేబినెట్లో హిట్‌లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారు. (చదవండి: తిరిగి రండి.. మీకు పూర్తి రక్షణ కల్పిస్తాం: అఫ్గన్ ప్రధాని) తాలిబన్ల ఆక్రమణ ప్రాంరంభం అయిన నాటి నుంచి పంజ్‌షీర్ లోయలో అహ్మద్ మసూద్ నేతృత్వంలోని నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ దళాలకు, తాలిబన్లకు మధ్య మొదలైన భీకరపోరు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. చదవండి: పాక్ కనుసన్నల్లో... -
కొత్త కోణం: అఫ్గాన్ సింహాలు తలవంచేనా!
పంజ్‌షీర్... యావత్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు. తాలిబన్లకు సైతం చుక్కలు చూపిస్తున్న ఐదు సింహాల గడ్డ. ఆఫ్గాన్ నేలపై ఆధిపత్యాన్ని ససేమిరా సహించని పౌరుషానికి రూపం. ఆ లోయను కైవసం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించినా, చిట్టచివరి యోధుడి చిట్టచివరి రక్తపుబొట్టు నేలలో ఇంకేవరకూ తమను గెలవడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు పంజ్‌షీర్ పోరాటవీరులు. ప్రపంచం మొత్తం కరుడుగట్టిన తీవ్రవాదుల్లా భావిస్తోన్న తాలిబన్లను ఎదిరించే సత్తా వీరికెలా వచ్చింది? అంతటి ధీరత్వం, తెగింపు, పట్టుదలకు మూలాలు ఏమిటనేదే ఇప్పుడు చర్చించాల్సిన అంశం. పరిపాలన రీత్యా అఫ్గానిస్తాన్‌లోని ఒక రాష్ట్రం... పంజ్‌షీర్. అమెరికా సేనలు అఫ్గాన్‌ను వీడనున్నట్టు ప్రకటించిన తర్వాత యావత్ అఫ్గాన్నూ అవలీలగా ఆక్రమించుకుంది తాలిబన్ సాయుధ సేన. కానీ ఒకే ఒక చిన్న ప్రాంతం మాత్రం ఈ వ్యాసం రాసేనాటికి పూర్తిగా తాలిబన్ల వశం కాలేదు. అమెరికా తయారు చేసిన ఉగ్రవాదం చివరికి అమెరికానే తరిమికొట్టింది. అమెరికా చేసిన తప్పిదం వల్ల అమెరికా వీడి వెళ్ళిన అత్యాధునిక ఆయుధ సంపత్తి, యుద్ధ విమానాలు ఇప్పుడు తాలిబన్ల చేతుల్లో ఉన్నాయి. చైనా, రష్యా, పాకిస్తాన్ అండదండలున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ పంజ్‌షీర్‌లో అడుగు పెట్టలేక పోయారు. కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌లో చివరగా తాలిబన్లు చేసిన ప్రయత్నం–డ్రోన్ల సాయంతో బాంబుల వర్షం కురిపించడం. నిజానికి తాలిబన్ల బలం ముందు పంజ్‌షీర్ నిలబడుతుందా? అనేది ప్రశ్నార్థకమే. కానీ గత చరిత్రను తడిమితే, వారెప్పుడూ విదేశీ సైన్యానికి గానీ, స్వదేశీ సేనలకుగానీ లొంగిపోయింది లేదు. ఎంతటి ఘాతుకానికైనా తెగబడి పంజ్‌షీర్‌ని వశపర్చుకోజూసినా అది తాలిబన్ల తరంకాలేదు. దీంతో పాకిస్తాన్ సాయంతో యువ కిరణం మసూద్‌ని మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. అఫ్గాన్ మాజీ ఉపా ధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇంటిపై బాంబుల వర్షం కురిపించారు. ఇతర నేతల నివాసాలను కూడా బాంబులతో పేల్చి వేశారు. పంజ్‌షీర్ గవర్నర్ కార్యాలయంపై జెండా ఎగురవేసి, తాము గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు తాలిబన్లు. మొన్నటివరకూ అఫ్గాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్– ‘ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా చట్టబద్ధ పాలనను గౌరవించాలి. కానీ హింసను కాదు. పాకిస్తాన్, తాలిబన్లు కలిసి అఫ్గానిస్తాన్‌ను కబళించడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించదు. హింస ముందు అఫ్గాన్ ప్రజలు మోకరిల్లరు’ అంటూ సాహసోపేతమైన ప్రకటన చేశారు. అమ్రుల్లా సలేహ్ పంజ్‌షీర్ నేలపై పుట్టిన వాడు. ఆ ప్రాంతం నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. 80వ దశకంలో సోవియట్ సేనలతో, 90వ దశకంలో తాలిబన్ల పాలన కాలంలో పంజ్‌షీర్ తరఫున పోరాడిన అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్ ప్రజానాయకుడు అయిన అమ్రుల్లాకు అండగా నిల బడ్డాడు. అమ్రుల్లా వ్యూహంతో, మసూద్ నాయకత్వంలో పంజ్‌షీర్ పోరాడుతోంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనేది ప్రశ్నే కాదు. పంజ్‌షీర్ల వారసుడు ఒక్కడున్నా ఈ యుద్ధం ముగియదన్నది సత్యం. అఫ్గానిస్తాన్ బహు జాతుల సమ్మేళనం. అనేక గిరిజన తెగల సమాహారం. చాలాకాలం ఈ తెగలు వేటికవే స్వతంత్రంగా బతి కాయి. మెజారిటీగా అందరూ ముస్లింలే అయినప్పటికీ–జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, ఇతర విలువల రీత్యా ఎవరికి వారుగానే ఉన్నారు. వీరిలో పష్తూన్, తజిక్స్, హజారాస్, ఉజ్బెక్, బలూచ్, అయిముఖ్, క్విజల్, బాశ్, టర్క్‌మన్, క్యూజక్, పార్శివాన్, సయ్యద్, కిర్గిజ్, అరబ్ లాంటి ఎన్నో తెగలున్నాయి. ఇందులో పష్తూన్, తజిక్స్, హజారాస్ ప్రధానమైనవి. ప్రస్తుత అఫ్గాన్ జనాభా దాదాపు 3 కోట్ల 80 లక్షలు. ఇందులో 42 శాతం పష్తూన్లే. వీరినే పఠాన్లు అని కూడా అంటారు. తజక్ జనాభా 27 శాతం. హజారాలు 9 శాతం, ఉజ్బెక్లు 4 శాతం, అయిమక్లు 4 శాతం, టర్క్మన్లు 3 శాతం, బలూచ్‌లు 2 శాతం ఉన్నారు. పష్తూన్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరు సంచార జీవనం గడుపుతుంటారు. ఆధు నిక పద్ధతులు అలవాటు కాలేదు. తాలిబన్ల సాయుధ బలగంలో వీరిదే అగ్రభాగం. నాయకత్వ స్థానంలోనూ అధిక సంఖ్యలో ఉన్నారు. జనాభా రీత్యా రెండవ స్థానంలో ఉన్న తజిక్ తెగ ఆధునిక సమాజంగా వృద్ధి చెందింది. మూడవ స్థానంలో ఉన్న హజారా తెగ వ్యవసాయం, పశుపోషణ, గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తోంది. వెయ్యేండ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన చంఘిజ్‌ఖాన్ వారసులమని వీరు చెప్పుకుంటారు. ఈ మూడు తెగల ప్రభావం ఆఫ్గాన్‌పై ఉంటుందనేది వాస్తవం. ఈ ఆధిపత్య తెగ పశ్తూన్లకూ, మిగిలిన తెగలకూ మధ్య నిరంతర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ వైరానికి దశాబ్దాల చరిత్ర ఉంది. మొదటిసారిగా 1975లో ఆనాటి ప్రధానమంత్రి దావూద్ ఖాన్‌కు వ్యతిరేకంగా పంజ్‌షీర్ లోయలో తిరుగుబాటు జరిగింది. దావూద్ పష్తూన్ తెగకు చెందిన నాయకుడు. తజక్ తెగకు చెందిన తాహిర్ బదాక్షి నాయకత్వంలో జరిగిన ఈ తిరుగుబాటును వామపక్ష తిరుగుబాటుగా చెపుతారు. అదేవిధంగా ముస్లిముల్లో షియా వర్గానికి చెందిన హజారా నాయకత్వంలో షల్లెహ–ఏ–జిహాద్ పేరుతో 1960ల్లోనే ఒక విప్లవ సంస్థ నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రోజు పంజ్‌షీర్‌లో ప్రధా నంగా తజక్, హజారా తెగలు... ప్రధానంగా పష్తూన్ల నాయకత్వంలో ఉన్న తాలిబన్లతో ఘర్షణలో ఉన్నారు. అమెరికా సైన్యం అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తరువాత, అఫ్గాన్ జాతీయ ప్రభుత్వాన్ని నడిపిం చడంలో పంజ్‌షీర్ నాయకత్వం ప్రధాన పాత్ర పోషించింది. పంజ్‌షీర్ తెగలు తాలిబన్లను ఎదిరించి నిలవడానికి, చారిత్రకంగా వస్తున్న జాతుల మధ్య వైరుధ్యాలే ప్రధాన కారణం. పంజ్‌షీర్ శత్రు దుర్భేధ్యమైనది. ఇది కాబూల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో హిందూకుష్ పర్వతాలను ఆనుకొని ఉన్న ఒక లోయ. ఈ లోయలోకి ప్రవేశించాలంటే ఉన్నది ఒకే ఒక చిన్న మార్గం. ఆ ఏకైక సన్నని తోవగుండానే ఎవరైనా లోనికి పోవాల్సి ఉంటుంది. అది కూడా పంజ్‌షీర్ నదిని దాటుకొని వెళ్లాలి. పంజ్‌షీర్ ప్రజలది ప్రత్యేకమైన జీవన విధానం. యుద్ధ విద్య వారి జీవితంలో భాగం. సహజసిద్ధంగా వారసత్వంగా లభించిన ధీరత్వం వీరికి పెట్టని కిరీటం. వేల ఏళ్ళుగా స్వతంత్రంగా జీవనం సాగించిన పంజ్‌షీర్ ప్రాంతం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించింది. దానికి కారణం ఈ లోయను పచ్చల మణిహారమని చెపుతారు. అత్యంత విలువైన ఖనిజాలు, పచ్చలు(190 క్యారెట్లు కలిగిన ఎమరాల్డ్) ఇక్కడ లభ్యమవడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా ఎదిగింది. మధ్యయుగాల కాలంలోనే వెండి గనులు విస్తారంగా ఉండేవి. క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలోనే ఈ ప్రాంతానికి చెందిన ఐదుగురు నాయకులు, స్వయంగా అన్నదమ్ములు అక్కడి నదిపైన ఆనకట్టను నిర్మించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. తరతరాలుగా ప్రజలను వరదల నుంచి రక్షించడమే కాకుండా, వ్యవసాయాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. ఆ ఐదుగురు సోదరులనే ఇక్కడి ప్రజలు ఐదు సింహాలుగా, తమ కుల దైవాలుగా కొలుచుకుంటారు. అందుకే ఈ ప్రాంతానికి పంజ్‌షేర్ అనే పేరొచ్చింది. పంజ్‌షేర్ కాస్తా వాడుకలో పంజ్షీర్గా ప్రాచుర్యం పొందింది. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించడం వల్ల పంజ్‌షీర్ ప్రజ లకు స్థిరమైన జీవన విధానం అలవాటయ్యింది. దీంతో పట్టణాల నిర్మాణం వైపు మొగ్గుచూపారు. దీనికి భిన్నమైన జీవన విధానం పష్తూన్లది. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ వీరు సంచార జీవనమే సాగిస్తున్నారు. ఇస్లాంలో ఉండే విషయాలను మరింత కఠినంగా, మూఢంగా నమ్ముతారు; ఆచరిస్తారు; ప్రచారం చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇతర సమాజంతో, సంప్రదాయాలతో పరస్పర సంబంధాలు లేకపోవడం వలన వెయ్యేళ్ళ కిందటి సంప్ర దాయాలను మక్కీకి మక్కీ అమలు చేస్తున్న పరిస్థితి. తాము మాత్రమే నిజమైన ముస్లింలుగా వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే వైరుధ్యం ఇతర తెగలతో ఘర్షణలకు దారితీస్తోంది. ఆధునిక పద్ధ తుల్లో ముందుకు వెళుతోన్న తజిక్, హజారా తెగలకు పష్తూన్ నాయకత్వంలోని తాలిబన్లు సహజ శత్రువులుగా కనిపిస్తున్నారు. ఒకరకంగా సాంప్రదాయక ఛాందసత్వానికీ, ఆధునిక జీవన విధానానికీ మధ్య జరుగుతున్న పోరాటంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. బలవంతమైన మెజారిటీ వర్గం అణచివేతకు వ్యతిరేకంగా పంజ్షీర్లు తరతరా లుగా సాగిస్తోన్న ఈ పోరాటం... గెరిల్లా యుద్ధ తరహాలో ఉన్న ప్రజా స్వామ్యయుతమైన పోరాటం! - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
పాక్ జోక్యాన్ని సహించం
కాబూల్: అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో పాకిస్తాన్ జోక్యాన్ని నిరసిస్తూ మంగళవారం వందలాది మంది కాబూల్ రోడ్లెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ సహాయ సహకారాలు అందించిందని, పాక్ వైమానిక దాడులు జరిపి పంజ్‌షీర్ తాలిబన్ల పరం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్ లీవ్ అఫ్గానిస్తాన్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. పాక్ ఆడించినట్టు ఆడే ప్రభుత్వం తమకు వద్దని, సమ్మిళిత ప్రభుత్వమే కావాలని డిమాండ్లు చేశారు. మరోవైపు నిరసనకారులను చెదరగొట్టడానికి తాలిబన్ కమాండర్లు గాల్లో కాల్పులు జరిపారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. నిరసన ప్రదర్శనల కవరేజ్ చేస్తున్న జర్నలిస్టుల్ని తాలిబన్లు అరెస్ట్ చేసినట్టుగా అఫ్గాన్‌లో టోలో న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హెరాత్‌లో పాక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శలపై తాలిబన్లు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇద్దరి మృతదేహాలను నగర కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పంజ్‌షీర్‌లో విదేశీ జెట్లు దాడులు జరపడంపై ఇరాన్ కూడా తాలిబన్లను నిలదీసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. చదవండి: చమన్ బోర్డర్‌ను మూసేసిన పాక్ -
పంజ్‌షీర్‌పై పట్టు సాధించాం!
కాబూల్: దశాబ్దాలుగా తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్ ప్రావిన్సును ఎట్టకేలకు హస్తగతం చేసుకున్నామని తాలిబన్లు సోమవారం ప్రకటించారు. ఇప్పటివరకు తాలిబన్ల పాలనకు లొంగకుండా ఉన్నవారికి పంజ్‌షీర్ కేంద్రస్థానంగా నిలిచింది. కానీ తాజాగా పంజ్‌షీర్‌లోని 8 జిల్లాల్లో తాలిబన్లు వేలాదిగా ప్రవేశించి మొత్తం ప్రావిన్సును ఆక్రమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఫైటర్ల చేతికి పంజ్‌షీర్ చిక్కిందని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ప్రతిఘటన బృందాలను జయించామని, మిగిలినవారు పారిపోయారని చెప్పారు. అణచివేతకు గురైన పంజ్‌షీర్ ప్రజలకు విముక్తి లభించిందన్నారు. పంజ్‌షీర్ ప్రజలకు సంపూర్ణ రక్షణ ఇస్తామని, వారిపై ఎలాంటి వివక్ష చూపమని జబీహుల్లా చెప్పారు. కానీ తాలిబన్ల రాకతో భయపడిన వేలాదిమంది పర్వతాల్లోకి పారిపోయారు. తాలిబన్ బృందాలు గవర్నర్ ఆఫీసు వద్ద జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. మరోవైపు తాలిబన్ల ప్రకటనను పంజ్‌షీర్ పోరాట నేతలు తోసిపుచ్చారు. అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లాసలేహ్, పంజ్‌షీర్ నేత అహ్మద్ మసూద్ నేతృత్వంలో ఇంతవరకు పంజ్‌షీర్‌లో దళాలు తాలిబన్లను ప్రతిఘటిస్తూ వచ్చాయి. తాలిబన్లు మారణ హోమాన్ని నిలిపివేస్తే చర్చలకు తాము సిద్ధమని ఇటీవలే అహ్మద్ ప్రకటించారు. కానీ తాలిబన్లు పోరాటానికే నిశ్చయించుకొని పంజ్‌షీర్ లోయపై దాడి చేశారు. ఫహీమ్‌ని చంపేశారు పంజ్‌షీర్ పోరాట దళాల ప్రతినిధిగా బయటప్రపంచానికి ఎప్పటికప్పుడు విశేషాలు తెలియజేస్తూ వచి్చన ఫహీమ్ దష్తి గొంతు మూగబోయింది. ఈ మేరకు అఫ్గాన్ రెసిస్టెంట్ ఫ్రంట్ ఫేస్బుక్ పేజీలో ప్రకటించింది. ఫాసిస్టు గ్రూపుతో పోరాటంలో ఫహీమ్ అమరుడయ్యాడని నివాళి అరి్పంచింది. పాకిస్తాన్ జరిపిన దాడిలో ఫహీమ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారని పంజ్ïÙర్ నేత మసూద్ ఒక ప్రకటనలో చెప్పారు. చర్చలకు సిద్ధమన్నా వినకుండా తాలిబన్లు తమపై పోరుకు వస్తున్నారని మసూద్ సోమవారం విమర్శించారు. అమ్రుల్లా సలేహ్, మసూద్ ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. సలేహ్ నివసించే ఇంటిపై ఆదివారం హెలికాప్టర్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడి నుంచి సలేహ్ సురక్షితంగా తప్పించుకొని గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పంజ్‌షీర్ చాలా రోజులు పోరాటం చేస్తుందని నిపుణులు భావించారు. కానీ అంతర్జాతీయంగా ఎలాంటి సాయం అందకపోవడంతో చివరకు ఈ ప్రాంతం కూడా తాలిబన్లకు తలవంచాల్సి వచి్చంది. పాక్ అండతోనే: మసూద్ పంజ్‌షీర్‌పై తాలిబన్లు పట్టుసాధించడంలో పాకిస్తాన్ సాయం చేసిందని పంజ్ïÙర్ నేత అహ్మద్ మసూద్ నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశారు. పాక్– తాలిబన్ బంధం గురించి ప్రతి దేశానికి తెలుసని, కానీ ఎవరూ నోరువిప్పడం లేదని వాపోయారు. కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి వారికి పాక్ సాయం చేస్తోందని దుయ్యబట్టారు. పాక్ సాయంతోనే తాలిబన్లు పంజ్‌షీర్‌పై దాడికి దిగారన్నారు. తాలిబన్లు మారలేదని, మరింత క్రూరంగా తయారయ్యారని విమర్శించారు. పంజ్ïÙర్ను ఆక్రమించుకున్నామన్న తాలిబన్ ప్రకటనను ఆయన సోమవారం కొట్టిపారేశారు. చివరి రక్తపు బొట్టు వరకు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. పాక్‌కు చెందిన ఒక జెట్‌ను తమ యోధులు కూలి్చవేశారని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. పాక్ పంపిన డ్రోన్లను పంజ్‌షేర్ దళాలపై దాడి చేయడానికి తాలిబన్లు వినియోగించారని, కమాండోలను పాక్ ఎయిర్‌డ్రాప్ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్ సహా ఇతర దేశాల జోక్యాన్ని సహించం ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్‌తో సహా ఏ దేశాన్నీ అనుమతించబోమని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టంచేశారు. సోమవారం జబీహుల్లా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధినేత లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్.. తాలిబన్ అగ్రనేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో కాబూల్‌లో సమావేశమయ్యారనే విషయాన్ని ఈ సందర్భంగా జబీహుల్లా ధ్రువీకరించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సాగే ఎలాంటి కార్యకలాపాలకైనా అఫ్గాన్ భూభాగాన్ని వాడుకోనివ్వబోమంటూ బరాదర్ ఈ భేటీ సందర్భంగా హామీద్‌కు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పాత్రపై మీడియా ప్రశ్నించగా.. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్‌తో సహా ఏ ఇతర దేశమూ జోక్యం చేసుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ దేశ వ్యవహారాల్లో ఇతరులు వేలు పెట్టొద్దని సూచించారు. తాలిబన్ ‘తెర’గతులు అఫ్గాన్‌లో యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యాయి. పలు ప్రైవేట్ కాలేజీలు తెరుచుకున్నాయి. అన్నిట్లో స్త్రీ, పురుష విద్యార్ధులను వేరు చేస్తూ అడ్డంగా కర్టెన్లు, తెరలను ఏర్పాటయ్యాయి. షరియా చట్టం ప్రకారం మహిళలకు చదువుకునే హక్కు ఉందని, అయితే మగ పిల్లలతో పాటు కలిసి చదివే వీల్లేదని తాలిబన్లు స్పష్టం చేశారు. దీంతో కాలేజీలన్నింటిలో తరగతి గదుల మధ్యలో తెరలు ప్రత్యక్షమయ్యాయి. అలాగే మహిళా విద్యార్థులకు కేవలం మహిళలు లేదా వృద్ధులైన మగవారు మాత్రమే బోధన చేయాలని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అలాగే మహిళా విద్యార్ధులు తప్పనిసరిగా అబయా, నికాబ్(శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే బురఖా) ధరించాలని, ఆడపిల్లలను క్లాసు అయిపోవడానికి ఐదు నిమిషాల ముందే బయటకు పంపాలని, అప్పుడే మగవిద్యార్ధులతో వారు కలవకుండా ఉంటారని తాలిబన్లు ఆర్డరేశారు. తరగతి గదుల్లో తెరలు వేలాడదీసిన ఫొటోలను అమాజ్ న్యూస్ ట్విట్టర్లో పోస్టు చేసింది. కాలేజీలో విద్యార్థినీ విద్యార్థుల సీట్ల మధ్య తెర ఏర్పాటుచేసిన దృశ్యం -
Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్ గురించి తెలుసా?
-
పంజ్‌షీర్‌లో ఎగిరిన తాలిబన్ల జెండా
-
Panjshir: తాలిబన్ల పైచేయి.. పంజ్‌షీర్ కైవసం
అఫ్గనిస్తాన్‌లో హోరాహోరీగా సాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు ముగిసింది!. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. అఫ్గనిస్తాన్‌లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపాడు. మరోపక్క పంజ్‌షీర్ ప్రావిన్సియల్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుపెట్టామని పంజ్‌షీర్ యోధులు ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. చదవండి: పోరాటాల గడ్డ.. పంజ్‌షీర్ మరోవైపు పంజ్‌షీర్ సాయుధ దళాల నేత అహ్మద్ మసూద్ పోరాటం పక్కనపెట్టి, చర్చల కోసం హస్తం చాస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించాడు. అయితే ఆయుధం పక్కనపెట్టే ప్రసక్లే లేదని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తాజా ‘పంజ్‌షీర్ కైవసం’ ప్రకటన కథనాలపై స్పందించేందుకు అహ్మద్ అందుబాటులో లేకుండా పోయాడు. ఆయన పరారీలో ఉన్నట్లు లోకల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. #FahimDashty was not a fighter, he was a journalist. And killing a journalist is a war crime. One of many, alas, committed by the Taliban. He was brave and sweet. He was with #AhmadShahMassoud on Sept 9, 2001; but he did not survive the assault on #Panjshir ... #PrayForPanjshir pic.twitter.com/nOOumkhsZN — Bernard-Henri Lévy (@BHL) September 5, 2021 అఫ్గన్ జాతీయ ప్రతిఘటన దళాల ప్రతినిధి, అఫ్గన్ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడు ఫహిమ్ దాష్టీని తాలిబన్లు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. అయితే పాక్ దళాలు జరిపిన డ్రోన్ బాంబు దాడుల్లో ఆయన మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పాక్ సహకారంతో తాలిబన్లు పంజ్‌షీర్‌ను కైవసం చేసుకుందని అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో పంజ్‌షీర్‌లో మారణహోమం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. చదవండి: భారీ నష్టం తాలిబన్లకేనా? -
పంజ్‌షీర్ ప్రావిన్స్ పోరులో అఫ్గన్ కీలక ప్రతినిధి మృతి
కాబూల్: ఆదివారం పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో జరిగిన పోరాటంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న బృందంలో కీలక వ్యక్తి మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతి చెందిన వ్యక్తి.. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి ఫాహిమ్ దాష్టీ, జమియత్-ఇ-ఇస్లామీ పార్టీ సీనియర్ సభ్యుడు, ఆఫ్ఘన్ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడిగా గుర్తించారు. పంజ్‌షీర్ లోయ హిందూ కుష్ పర్వతాలలో, కాబూల్‌కు ఉత్తరాన దాదాపు 90 మైళ్ల దూరంలో ఉంది. నెలరోజుల వ్యవధిలో ప్రభుత్వ అనుకూల దళాలలో ఈ ప్రాంతంలో ఉక్కుపాదం మోపిన తరువాత తాలిబాన్లతో వారు పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం లోయ త్వరలో కూలిపోవచ్చని నివేదికలు చెప్తున్నాయి. అయితే,ఆఫ్గన్ దళాలు మాత్రం అటువంటి వాదనలను ఖండించాయి. దళాల నాయకుడు అహ్మద్ మసౌద్ ఆదివారం మాట్లాడుతూ.. తాలిబాన్లు ప్రావిన్స్ని విడిచిపెడితే తాము పోరాటం ఆపడానికి, చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ తాలిబన్లతో విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉందని మిస్టర్ మసౌద్ అన్నారు. చదవండి: Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్‌పై పట్టు చిక్కేనా? -
Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్ గురించి తెలుసా?
పంజ్‌షీర్.. కొద్ది రోజులుగా ఈ పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. చుట్టూ పర్వతాలే కోట గోడలా రక్షణనిస్తున్న ఆ లోయవైపు ఇన్నాళ్లూ ఎవరూ కన్నెత్తి కూడా చూడలేకపోయారు. ఇప్పుడు తాలిబన్లు ఆ లోయపై పట్టు బిగించాలని చూస్తూ ఉంటే మరోవైపు తాలిబన్ వ్యతిరేక శక్తులు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఎందుకీ లోయపై తాలిబన్లకు అంత మక్కువ? అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌కు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో హిందుకుష్ పర్వత సానువుల్లో పంజ్‌షీర్ లోయ ఉంది. దీనిని అయిదు సింహాల లోయ అని కూడా పిలుస్తారు. ఈ లోయకి ఆ పర్వతాలే రక్షణ కవచాల్లా నిలుస్తాయి. ఈ లోయలోకి వెళ్లాలంటే పంజ్‌షీర్ నది వల్ల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ఇరుకైన రహదారి మాత్రమే మార్గం. అందుకే అక్కడి స్థానికులకు ఈ లోయను కాపాడుకోవడం అత్యంత సులభంగా మారింది. భౌగోళికంగా చూస్తే అఫ్గాన్‌తో సంబంధం లేనట్టుగానే ఉంటుంది కానీ దేశంలో ఉన్న 34 ప్రావిన్స్‌లలో పంజ్‌షీర్ కూడా ఒకటి. చారిత్రకంగా చూస్తే పలుమార్లు నిర్ణయాత్మక పాత్రని పోషించింది. మొదట్నుంచి ఎవరికీ తలవంచకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈ లోయపై ఆధిపత్యం సాధించడానికి తాలిబన్లు ఈసారి తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. పోరాటాల గడ్డ పంజ్‌షీర్ అంటే అహ్మద్ షా మసూద్ గురించి చెప్పుకోవాలి. 1953 సంవత్సరంలో ఈ లోయలో జన్మించిన మసూద్ తనకంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇస్లాం మత శక్తులతో తనలో చివరి ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూ వచ్చారు. పంజ్‌షీర్ లోయ స్వతంత్రతని కాపాడారు. 1980 దశకంలో అఫ్గాన్‌ను సోవియెట్ యూనియన్ దురాక్రమణ చేసినప్పుడు, 1990 నాటి అంతర్యుద్ధం సమయంలో, తాలిబన్లు దేశాన్ని పాలించిన 1996–2001 మధ్య కాలంలో కానీ ఈ లోయ ఎప్పుడూ ఎవరి వశం కాలేదంటే మసూద్ పోరాట పటిమే కారణం. ఆ లోయలో లక్షా 50 వేల మంది వరకు నివసిస్తారు. వారంతా తాజిక్ తెగకు చెందిన వారు. మరోవైపు పాస్తూన్ తెగ వారు ఎక్కువగా తాలిబన్ ముఠాలో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మçసూద్ శక్తియుక్తులతో వారు ఆ లోయవైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. పంజ్‌షీర్ లోయతో పాటు చైనా, తజికిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య పాకిస్తాన్ వరకు ఆయన ప్రభావమే ఉండేది. మసూద్‌కి సంప్రదాయ ఇస్లామ్ భావాలు ఉన్నప్పటికీ సమాజంలో మహిళలకు సమాన స్థానం ఇవ్వాలని ఆరాటపడేవారు. అయితే మసూద్ గ్రూప్ సభ్యులే ఎక్కువగా మానహక్కుల్ని హరించారన్న విమర్శలు ఉన్నాయి. 2001లో మసూద్‌ని అల్‌ఖాయిదా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ లోయను నడిపిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మద్‌లు కూడా ఆయనకు సహకరిస్తూ లోయను కాపాడుతున్నారు. పచ్చల లోయ ఈ లోయలో ఎక్కువగా ఎమరాల్డ్ (పచ్చలు) లభిస్తాయి. ఇప్పటివరకు ఇంకా తవ్వకం చేపట్టని ఎన్నో పచ్చల గనులు ఉన్నాయి. అవే ఈ ప్రాంతానికి ప్రధాన ఆదాయ వనరు. అమెరికా నాటో దళాలు స్వాదీనంలో అఫ్గాన్ ఉన్నప్పుడు ఈ లోయలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. అఫ్గాన్‌లో ఇంధనానికి ఒక హబ్‌గా మారింది. ఎన్నో జలవిద్యుత్ ఆనకట్టల్ని ఈ లోయలో నిర్మించారు. విద్యుత్‌లో స్వయంసమృద్ధిని సాధించిన ప్రాంతం ఇదొక్కటే. పచ్చల గనులతో ఆర్థికంగా పటిష్టంగా ఉండడంతో తాలిబన్లు ఈ లోయని ఆక్రమించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. పంజ్‌షీర్‌కు ఎదురయ్యే సవాళ్లేంటి ? పంజ్‌షీర్‌లో పచ్చలు, వెండి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆహారం, వైద్యం అవసరాల కోసం అఫ్గాన్‌లో ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పదు. ప్రస్తుతం ఈ లోయ చుట్టూ తాలిబన్లు తమ కమాండర్లను మోహరించారు. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల సరఫరా నిలిపివేశారు. అయితే ఆ లోయలో వచ్చే చలికాలం వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరించే ఆ లోయ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా కనిపిస్తోంది. పంజ్‌షీర్‌పై పూటకొక రకమైన వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Afghanistan- Panjshir: పంజ్‌షీర్‌లో హోరాహోరీ
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తమ స్వాదీనంలో లేని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్‌షీర్‌ను ఎలాగైనా తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలతో ఆ లోయలో హోరాహోరీ పోరాటం జరుగుతోంది. తాలిబన్లు, వారిని గట్టిగా ప్రతిఘటిస్తున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ (ఎన్ఆర్ఎఫ్ఏ) ఎవరికి వారే తమదే పై చేయిగా ఉందని చెప్పుకుంటున్నారు. ఖవాక్ మార్గం వద్ద వందలాది మంది తాలిబన్లతో జరిగిన పోరులో 700 మందికిపైగా తాలిబన్లు మరణించారని, మరో 600 మందిని నిర్బంధించి జైళ్లలో ఉంచామని ఎన్ఆర్ఎఫ్ఏ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు పంజ్‌షీర్ ప్రావిన్స్ బజారక్‌లోకి ప్రవేశించి గవర్నర్ కార్యాలయాన్ని చుట్టుముట్టినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ అదంతా ఉత్తదేనని తేలింది. పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో ఉన్న ఏడు జిల్లాలకు గాను నాలుగు జిల్లాలైన షూతల్, అనాబా, ఖింజ్, ఉనాబాలపై పట్టు సాధించామని తాలిబన్ అధికార ప్రతినిధి బిలాల్ కరిమి వెల్లడించినట్టుగా అస్వాకా న్యూస్ ఏజెన్సీ కథనాన్ని ప్రచురించింది. మానవీయ సంక్షోభాన్ని నివారించండి: యూఎన్‌కు సలేహ్ లేఖ పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు భీకరంగా దాడి చేస్తున్నారని, ఈ లోయలో మానవీయ సంక్షోభం ముంచుకొస్తుందని అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల దాడుల్ని అడ్డుకొని మానవీయ సంక్షోభం నుంచి లోయని కాపాడాలంటూ ఆయన ఐక్యరాజ్యసమితి(యూఎన్)కి ఒక లేఖ రాశారు. తమ లోయకి తాలిబన్లు కమ్యూనికేషన్లని కట్ చేశారని, ఆర్థికంగా కూడా దిగ్బంధిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్ల దాడిని అడ్డుకొని చర్చల ద్వారా ఒక రాజకీయ పరిష్కారానికి కృషి చెయ్యాల్సిన అవసరం ఉందని సలేహ్ ఆ లేఖలో పేర్కొన్నారు. చర్చలకు సిద్ధం: మసూద్ తాలిబన్లు పంజ్‌షీర్, అంద్రాబ్‌ల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటే వారితో చర్చలకు సిద్ధమని ఎన్ఆర్ఎఫ్ఏ నాయకుడు అహ్మద్ మసూద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘శాంతియుతంగా తాలిబన్లతో విభేదాలను పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నాం. వివిధ గ్రూపులు, తెగలతో సమ్మిళిత అధికార వ్యవస్థ నెలకొంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. దేశీయ విమానాలు షురూ... కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జాతీయ విమానసంస్థ అరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్‌హెరాత్, కాందహార్, బాల్ఖ్‌లకు విమానాలను నడిపింది. రాడార్ వ్యవస్థ లేనందువల్ల పగటి పూట మాత్రమే విమానాలు నడుస్తున్నాయి. కాబూల్ విమానాశ్రయం పునరుద్ధరణకు ఖతార్, టర్కీ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవల పునరుద్ధరణ మానవతా సాయానికి వీలుకలి్పస్తుందని యూఎన్ పేర్కొంది. -
భారీ షాక్.. 600 మంది తాలిబన్ల హతం!
Afghanistan Panjshir Talibans Fight: అఫ్గనిస్తాన్‌లో ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది. అఫ్గన్ ప్రతిఘటన దళాలు, తాలిబన్లు చేస్తున్న పరస్పర పైచేయి ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కీలకమైన పంజ్‌షీర్ ప్రావిన్స్ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబన్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈలోపు పంజ్‌షీర్ తిరుగుబాటు దళం ఆ ప్రకటనను ఖండించింది. యుద్ధం కొనసాగుతోందని... పంజ్‌షీర్ లొంగిపోలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు పంజ్‌షీర్ ప్రతిఘటన దళం నుంచి మరో ప్రకటన వచ్చింది. హోరాహోరీ పోరులో 600 మంది తాలిబన్లను మట్టుపెట్టినట్లు ప్రకటించుకుంది. పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలకు పంజ్‌షీర్ యోధుల నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాము జరిపిన దాడుల్లో ఆరు వందల మంది తాలిబన్లు చనిపోయారని, వెయ్యి మందికి పైగా లొంగిపోయారని పంజ్‌షీర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టి ప్రకటించాడు. ఇక తాలిబన్ల దాడులను తిప్పి కొడుతున్నామని పంజ్షీర్లు చేస్తున్న ప్రకటనలతో... వాస్తవ పరిస్థితి ఏంటన్న దానిపై అంతర్జాతీయ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు పంజ్‌షీర్ దళాల ప్రకటనను తాలిబన్లు ధృవీకరించడం లేదు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై తాలిబన్ల యుద్ధం కొనసాగుతోందని చెప్పారు. అయితే పంజ్‌షీర్ రాజధాని బజారక్కి వెళ్లే రోడ్డు మార్గంలో ల్యాండ్ మైన్లు అమర్చారని, అందువల్లే అక్కడి నుంచి ముందుకెళ్లడం కష్టంగా మారిందని చెప్పారు. ఇప్పటివరకూ పంజ్‌షీర్‌లోని ఏడు జిల్లాల్లో నాలుగు తాలిబన్ల ఆధీనంలోకి వచ్చాయన్నారు. మిగతా జిల్లాలను కూడా వీలైనంత త్వరగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మధ్య ప్రావిన్స్ వైపు నుంచి తాలిబన్లు పోరాడుతున్నారని తాలిబన్ ప్రతినిధి బిలాల్ కరిమీ వెల్లడించారు. చదవండి: అఫ్గన్ ప్రభుత్వ ఏర్పాటు.. రంగంలోకి పాక్ ఇరు వర్గాలు ప్రకటనలైతే చేస్తున్నాయి గానీ... ఎక్కడా ఆధారాలు బయటపెట్టట్లేదు. దీంతో ఈ పరస్పర ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇంకోవైపు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను తిరిగి ప్రారంభించిన తాలిబన్లు.. మిగతా దేశాల ప్రతినిధులు, రవాణా, సహాయక చర్యల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్లిక్ చేయండి: తాలిబన్ల అత్యుత్సాహం.. అమాయకులు బలి -
తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!
కాబుల్: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ ప్రాంతం సవాలుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. తాజాగా శుక్రవారం తాలిబన్లు తాము పంజ్‌షీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాక తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు జరుపుకున్నారు. అయితే తాలిబన్ల అత్యుత్సాహం సామాన్యుల పాలిట శాపంగా మారింది. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 17 మంది అఫ్గన్ పౌరులు మరణించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. (చదవండి: కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?) రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ (ఎన్ఆర్ఎఫ్ఏ) ఓడించి, పంజ్‌షీర్‌ను అధీనం చేసుకున్నట్టు తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం గాల్లో కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనలో సుమారుగా 17 మంది మృతి చెందగా, 41 మంది గాయపడ్డారు. ఇలాంటి పనులతో పౌరులకు హాని తలపెట్టవద్దని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ట్విట్టర్లో సైనికులకు సూచనలు చేశారు. తిరుగుబాటుదారులు శాంతియుతంగా లొంగిపోవాలని ప్రకటించారు. అయితే పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల నాయకుడు అహ్మద్ మసూద్ మాత్రం దీన్ని కొట్టిపారేశాడు. ఈ విషయంపై పాకిస్తాన్ మీడియాల్లో ప్రసారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రతిఘటన దాడులు కొనసాగుతునే ఉన్నాయని అహ్మద్ మసూద్ స్థానిక మీడియాకు వెల్లడించారు. کابل ښار او ټول هیواد کې د مجاهدینو د پام وړ: له هوایي ډزو څخه جدا ډډه وکړئ او پر ځای یې د الله تعالی شکر اداء کړئ. ستاسي په لاس کې وسله او مرمۍ بیت المال دي، هیڅوک یې د ضائع کیدو حق نلري. سړې مرمۍ عامو خلکو ته د زیان اړولولو قوي احتمال لري؛ نو بناء بې ځایه ډزې مه کوئ. — Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) September 3, 2021 Afghanistan: తాలిబన్లకు కీలక సమాచారం చిక్కకూడదనే.. -
పంజ్‌షీర్‌ను జయించామన్న తాలిబన్లు.. అదేమీ లేదన్న తిరుగుబాటు దళం
కాబూల్: అప్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షీర్‌పై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా అక్కడి తిరుగుబాటుదారులు పోరాటం చేస్తున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజాగా మరిన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పంజ్‌షీర్ తమ స్వాధీనంలోకి వచ్చిందని తాలిబన్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు. అఫ్గాన్‌లోని చివరి ప్రావిన్స్ కాబూల్‌కు ఉత్తరాన ఉన్న పంజ్‌షీర్ లోయను కూడా వశం చేసకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఈ ఆక్రమణతో అఫ్గానిస్తాన్ పై పూర్తి అధికారం సాధించామన్నారు. ‘అల్లా దయతో అఫ్గానిస్తాన్ మొత్తం మా అధీనంలోకి వచ్చింది. తిరుగుబాటు దారులు ఓడిపోయారు. ప్రస్తుతం పంజ్‌షీర్ మా అధీనంలోనే ఉంది’ అని తాలిబన్ల కమాండర్ ఒకరు తెలిపారు. త్వరలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. చదవండి : Taliban-Kashmir: కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు విచిత్రమేమంటే రెండు వర్గాలు మేమే పై చేయి సాధించామని చెప్పుకుంటున్నాయి. పంజ్‌షీర్‌పై పట్టు సాధించామన్న తాలిబన్ల వాదనను అక్కడి తిరుగుబాటుదారులు కొట్టి పారేశారు. తాలిబన్లను తిప్పికొట్టామని ప్రకటించారు. అలాగే పంజ్‌షీర్ నుంచి పారిపోయాననే వాదనను అమ్రుల్లా సాలెహ్ తోసిపుచ్చారు. తాము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. రెండు వైపులా ప్రాణ నష్టం వాటిల్లింది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్లకు లొంగేది లేదు. ఎప్పటికీ అఫ్గాన్ పక్షాన నిలబడి పోరాడతామని సాలెహ్ ప్రకటించారు. మరోవైపు కొన్ని వందల తాలిబన్లు తమ వద్ద చిక్కుకున్నారనీ, వారికి ఆయుధాల కొరత కారణంగా లొంగిపోయేందుకు చర్చలు కొనసాగిస్తున్నారని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రతినిధి అలీ నజారీ వెల్లడించారు. చదవండి: Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్! అటు పంజ్‌షీర్‌ను హస్తగతం చేసుకున్నాంటూ తాలిబన్లు రెట్టింపు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో పంజ్‌షీర్‌పై విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కాబూల్‌లో తాలిబన్లు గాల్లోకి కాల్పులుల్లో 17 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చిన్నారులు సహా పలువురు మృతి చెందినట్లు స్థానిక ఆఫ్గన్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. -
కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?
కాబూల్: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికాతోపాటు నాటో దళాలు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయి. విదేశాలకు వెళ్లడానికి ఇప్పటిదాకా ఒకే ఒక్క ఆధారంగా నిలిచిన కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలు లేక నిశ్శబ్దం తాండవిస్తోంది. దీంతో అఫ్గాన్ ప్రజలు దేశ సరిహద్దులకు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా మరో దేశానికి వలస వెళ్లి తలదాచుకోవాలని ఆరాట పడుతున్నారు. ఇందుకోసం సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అఫ్గాన్ సరిహద్దులు జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్, ఇరాన్, ఇతర మధ్య ఆసియా దేశాల సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. అఫ్గాన్–పాకిస్తాన్ మధ్య కీలక సరిహద్దు తోర్ఖామ్. ప్రస్తుతం ఇక్కడ అఫ్గాన్ భూభాగంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడారని, గేటు తెరిచే సమయం కోసం వారంతా వేచి చూస్తున్నారని పాకిస్తాన్ అధికారి ఒకరు చెప్పారు. ఇక అఫ్గాన్–ఇరాన్ నడుమ సరిహద్దు అయిన ఇస్లామ్ ఖాలా బోర్డర్ పోస్టులో వేలాది మంది పడిగాపులు కాస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అఫ్గాన్ ప్రజల పట్ల ఇరాన్ భద్రతా సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారని, సరిహద్దును దాటే విషయంలో గతంలో పోలిస్తే ప్రస్తుతం కొంత వెలుసుబాటు కల్పిస్తున్నారని ఇరాన్లో అడుగుపెట్టిన అఫ్గాన్ వాసి ఒకరు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఎప్పుడు? అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి అక్కడి పరిపాలనపై పడింది. తాలిబన్లు ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాలిబన్లు 1996లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను ఆక్రమించినప్పుడు గంటల వ్యవధిలోనే లీడర్షిప్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈసారి మాత్రం తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అఫ్గాన్‌లో ఏకాభిప్రాయంతోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని తాను అంచనా వేస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. అఫ్గాన్‌లో ప్రస్తుతం అధికారికంగా ప్రభుత్వమేదీ లేదు. నూతన సర్కారు ఏర్పాటుపై నిర్ణయం దాదాపు ఖరారయ్యిందని, అతి త్వరలో ప్రకటిస్తామని తాలిబన్లు తెలిపారు. తాలిబన్ సీనియర్ నేత ముల్లా హెబతుల్లా అఖూంజాదా కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని, ఆయన కింద ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు దేశాన్ని ముందుకు నడిపిస్తారని తాలిబన్ కల్చరల్ కమిషన్ సభ్యుడు అనాముల్లా సమాంఘనీ తెలియజేశారు. పంజ్‌షీర్ తిరుగుబాటుదారులతో చర్చలు విఫలం కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌పై తాలిబన్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నయానో భయానో ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు, పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల మధ్య బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. పంజ్‌షీర్ లోయలో అహ్మద్ మసూద్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న సంగతి తెలి సిందే. ఇస్లామిక్ ఎమిరేట్‌లో చేరాలంటూ తాలిబన్ నాయకుడు ముల్లా అమీర్‌ఖాన్ ముతాఖీ బుధవారం పంజ్ షీర్ ప్రజలకు ఒక ఆడియో సందేశంలో పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత తాలిబన్లు, పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల మధ్య భీకర ఘర్షణ జరిగినట్లు తెలి సింది. ఈ ఘర్షణలో 15 మంది తాలిబన్లు హతమయ్యారని, 200 మంది గాయపడ్డారని, 55 మంది తమకు లొంగిపోయారని తిరుగుబాటుదారుల ప్రతినిధి ఫహీం దష్తీ బుధవారం ప్రకటించారు. ఖతార్ నుంచి సాంకేతిక బృందం రాక కాబూల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ తాలిబన్లకు పెద్ద సంకటంగా మారింది. ఎయిర్‌పోర్టును నిర్వహించే సామర్థ్యం వారికి లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే తమ మిత్ర దేశం ఖతార్ సాయాన్ని కోరుతున్నారు. తాలిబన్ల విజ్ఞప్తి మేరకు ఖతార్ ప్రభుత్వం బుధవారం ఒక సాంకేతిక బృందాన్ని ప్రత్యేక విమానంలో కాబూల్‌కు పంపించింది. ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు, విమానాల రాకపోకలపై ఈ బృందం తగిన సాయం అందించనుంది. కశ్మీర్‌కు విముక్తి లభించాలి: అల్–ఖాయిదా అఫ్గాన్‌ను మళ్లీ చేజిక్కించుకున్న తాలిబన్లకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్–ఖాయిదా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇస్లాం శత్రువుల కబంధ హస్తాల నుంచి కశ్మీర్, సోమాలియా, యెమెన్‌తోపాటు మిగతా ఇస్లామిక్ భూభాగాలకు విముక్తి లభించాలి. ఓ.. అల్లా! ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఖైదీలకు స్వేచ్ఛను ప్రసాదించు’’ అని తన ప్రకటనలో ప్రార్థించింది. -
పంజ్‌షీర్‌పై దాడి: 8 మంది తాలిబన్లు మృతి!
కాబూల్: తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్ ప్రాంతంపై పట్టుకోసం తాలిబన్లు ప్రయత్నాలు ఆరంభించారు. ఇందులో భాగంగా పంజ్‌షీర్ ప్రాంతంపై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 8 తాలిబన్లు మరణించారని పంజ్‌షీర్ వర్గాలు తెలిపాయి. పంజ్‌షీర్‌లో తాలిబన్ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ ప్రతినిధి ఫహీమ్ దాస్తీ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం రాత్రి తాలిబన్లు తమ లోయపై దాడికి వచ్చారని, అయితే తమ బలగాలు దాడిని తిప్పికొట్టాయని చెప్పారు. ఇరువైపులా పలువురికి గాయాలయ్యాయని, కానీ తాలిబన్ల వైపు ప్రాణనష్టం కూడా జరిగిందని చెప్పారు. ఓవైపు 20 ఏళ్ల యుద్దానికి ముగింపు పలుకుతూ అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తవుతుండగా.. మరోవైపు తాలిబన్లు ఈ దాడికి దిగడం గమనార్హం. చదవండి: Taliban: ‘రష్యా, అమెరికాలను ఓడించారు’ సరే.. మరి అసలు సమస్య?! -
అఫ్గాన్‌లో మరో యుద్ధం మొదలైంది!
గెలవని యుద్ధం ఎన్నాళ్ళు చేస్తామనే ఆలోచనొచ్చాక, ఎవరికైనా పోరాటం కొనసాగించడం కష్టమే. లేస్తే మనిషిని కాననే అగ్రరాజ్యానికైనా నిస్పృహ తప్పదు. ఇరవయ్యేళ్ళ క్రితం స్వాతిశయంతో అఫ్గాన్‌లో మొదలుపెట్టిన తీవ్రవాదంపై యుద్ధానికి అమెరికా ఎట్టకేలకు అగౌరవ ప్రదమైన రీతిలో స్వస్తి చెప్పింది. అమెరికన్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత కాలంగా సాగుతున్న అఫ్గాన్‌లోని యుద్ధమనే నెత్తిమీది బరువును ఎప్పుడు దించేసుకుందామా అని కొన్నేళ్ళుగా చూస్తున్న అమెరికా ఎట్టకేలకు ఆ భారం వదిలించుకుంది. సైనిక ఉపసంహరణకు తనకు తాను చెప్పిన తుది గడువు ఆగస్టు 31 కన్నా 24 గంటల ముందే 30వ తేదీ అర్ధరాత్రికే అంతా ముగిం చింది. రెండేళ్ళ క్రితం 2020 ఫిబ్రవరిలో శాంతి ఒప్పందం పేరిట తాలిబన్లకు చట్టబద్ధతనూ, లేని పోని బలాన్ని అందించి అమెరికా తప్పు చేసింది. చివరకు అఫ్గాన్‌లో శాంతియుత, సుస్థిర వ్యవస్థకు చోటివ్వకుండా హడావిడి డెడ్‌లైన్ ప్రకటన, ప్రణాళిక లేని సైనిక ఉపసంహరణలతో ఆఖరి తప్పూ పూర్తి చేసింది. (చదవండి: షారుక్ పాటకు.. స్టెప్పులు వేసిన అమెరికన్ జంట) ఆఖరి విమానంలో అమెరికా తాత్కాలిక రాయబారి, సైనికాధికారి సహా మిగిలిన కొందరు సైనికులూ తిరుగుముఖం పట్టారు. ఆగస్టు 15న కాబూల్ కైవసంతో మొదలైన తాలిబన్ల జైత్రయాత్రకు పదిహేను రోజుల్లోనే దక్కిన పతాకస్థాయి విజయమిది. చివరి దాకా పహారా కాసిన కాబూల్ విమానాశ్రయాన్ని సైతం అమెరికన్ సైనికులు ఖాళీ చేయడంతో, ఇప్పుడు అఫ్గాన్ మొత్తం తాలిబన్ల చేతికి వచ్చేసినట్టయింది. పంజ్‌షీర్ లోయ లాంటి చోట్ల అంతర్గత ప్రతిఘటన ఉన్నా, ఆధిపత్యం తమదేనని నిరూపించుకొనేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అవతరించిందంటూ గాలిలో కాల్పులతో సాయుధ తాలిబన్ల సంబరాలు... గాలిలో హెలికాప్టర్ మీద నుంచి మనిషిని ఉరి తీయడాలు... చూశాక కొత్త హయాం ఎలా ఉంటుందో అనూహ్యమేమీ కాదు. ‘మా దేశం మీదకొస్తే, ఎవరికైనా ఏ గతి పడుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ’ అన్న తాలిబన్ ప్రతినిధుల మాట ఇప్పుడు ప్రపంచంలో ప్రతిధ్వనిస్తున్న హెచ్చరిక. విపక్ష రిపబ్లికన్లతో పాటు స్వపక్ష డెమోక్రాట్లు, చివరకు సొంత పౌరుల నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు విమర్శలు తప్పలేదు. వాటన్నిటి మధ్యే ఆయన తాజా అధికారిక ప్రకటన చేశారు. లక్షమంది అఫ్గాన్ పౌరులు, 6 వేల మంది అమెరికన్ సైనికులు సహా అంతా కలిపి 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన సుదీర్ఘ యుద్ధం... 2.3 లక్షల కోట్ల డాలర్లకు పైగా అమెరికా ఖర్చు చేసిన కళ్ళెదుటి యుద్ధం ముగిసింది. కానీ, కనిపించని కొత్త యుద్ధం మొదలైంది. ఆరంభం నుంచి అంతిమ ఘట్టం దాకా అనేకానేక వ్యూహాత్మక తప్పిదాల ఫలితమే – ఈ మలి యుద్ధం. అమాయక అఫ్గాన్లు చేయాల్సి వచ్చిన హక్కుల యుద్ధం. తీవ్రవాదానికి అఫ్గాన్ అడ్డా కాకూడదని పొరుగునున్న భారత్ సహా పలు ప్రపంచ దేశాలు సాగించే రక్షణ, దౌత్య యుద్ధం. సొంత గడ్డ మీద ఉన్న సవాలక్ష తెగలతోనూ, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతోనూ తాలిబన్లు చేయాల్సి ఉన్న అధికార సహవాస యుద్ధం. ఛాందసవాద మూర్ఖత్వానికి మానవత్వం బలి కూకూడదని యావత్ మానవాళి చేయాల్సిన మహా యుద్ధం. పాత తప్పుల ఫలితంగా, భవిష్యత్ పరిణామాలను ప్రభావితం చేసే శక్తిని పాశ్చాత్య ప్రపంచం ఇప్పుడు చాలావరకు కోల్పోవడమే ఈ కొత్త యుద్ధంలోని కీలక కోణం. (చదవండి: తాలిబన్లతో భారత రాయబారి చర్చలు) అమెరికా ఛత్రచ్ఛాయలోని కాలంలో భారత్ సైనిక జోక్యం చేసుకోకుండా పార్లమెంట్ మొదలు అనేక నిర్మాణాలు, అభివృద్ధి సాయాలు, దౌత్య సంబంధాలతో అఫ్గాన్ పౌరసమాజం మనసు గెలిచింది. ప్రజాస్వామ్య అఫ్గాన్ సర్కారుకు ఆఖరు దాకా మద్దతు నిచ్చింది. ఇప్పుడిక మారిన పరిస్థితుల్లో వ్యూహం మార్చుకోక తప్పదు. అనిశ్చిత అఫ్గాన్‌లో కొత్త తాలిబన్ పాలనను మొత్తంగా తోసిపుచ్చడం కన్నా సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారిని దోవలోకి తెచ్చుకోవడమే ఇప్పటికి తెలివైన దౌత్యనీతి. అఫ్గాన్‌ను అమెరికా ఖాళీ చేసిన కొద్దిగంటలకే మంగళవారం భారత్ తొలిసారిగా తాలిబన్లతో చర్చలకు శ్రీకారం చుట్టింది. ఖతార్‌లోని భారత రాయబారి తాలిబన్ల అభ్యర్థన మేరకు దోహాలో వారి ప్రతినిధులను కలసి, చర్చలు జరిపినట్టు కథనం. అఫ్గాన్ భూభాగాన్ని తీవ్రవాదానికి వినియోగించుకొనేందుకు అనుమతించరాదని చర్చల్లో భారత్ తెలిపింది. అదే సమయంలో మన పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అనుమతించాలనీ కోరింది. అలాగే, అఫ్గాన్ పరిణామాలపై దృష్టి పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. అంతర్జాతీయంగా చట్టబద్ధత, ఆగిన విదేశీసాయం కోసం ఆరాటంతో తాలిబన్లు కూడా మెత్తటి కబుర్లు చెబుతున్నారు. కానీ, వివిధ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతో సంబంధమున్న తాలిబన్లను ఎంతవరకు నమ్మాలనేది ఇప్పుడు ప్రపంచమంతటితో పాటు భారత్‌కూ ఉన్న సమస్యే. మరోపక్క తాలిబన్ల భయంతో వేలాది అఫ్గాన్ జనం పాకిస్తాన్‌కి తరలిపోతుండడం ఇంకో విషాదం. లక్షా 23 వేల మందికి పైగా పౌరులను అమెరికా దళాలు అఫ్గాన్ నుంచి తరలించినా, వివిధ దేశాల పౌరులు ఇంకా అఫ్గాన్‌లో చిక్కుబడి ఉన్నారు. వెరసి, అమెరికా మునుపెన్నడూ లేనంత సుదీర్ఘకాలం సాగించిన యుద్ధం అన్ని రకాలుగా విఫలమైంది. తీరని అవమాన భారమే మిగిలింది. తీవ్రవాదంపై మొదలుపెట్టిన యుద్ధాన్ని చివరకు తీవ్రవాదులకే సానుకూలమయ్యేలా ముగించి, సేనలు ఇంటిముఖం పట్టడం విరోధాభాస. శాంతి అంటే యుద్ధానికీ, యుద్ధానికీ మధ్య విరామం అంటారు. కొత్త యుద్ధానికి సిద్ధమవడం ఒక్కటే ఇప్పుడు ప్రపంచానికి మిగిలింది. (చదవండి: 20 ఏళ్ల యుద్ధం ముగిసింది.. చిట్టచివరి సోల్జర్ ఈయనే!)