ఏఐ సాంకేతికత చాలా విప్లవాత్మకంగా దూసుకుపోతుంది. ఈ ఏఐ సంకేతికతో దూరమైపోయిన మన కుటుంబికులను మన కళ్లముందు ఉండేలా డిజటల్ ప్రపంచంలోకి తీసుకువెళ్తోంది. ఆయా వ్యక్తుల దూరమయ్యరనే బాధను పోగొట్టి శాంతిని చేకూరుస్తుంది. ఇలా కూడా ఉపయోగపడుతుందా? అనేలా కొంగొత్త ఆవిష్కరణలు మన ముందుకు వస్తున్నాయి. అలాంటి ఆవిష్కరణే ఓ తండ్రి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓ 'తండ్రి ప్రేమ' ఎంతటి సాహస కృత్యమైనా చేయిస్తుందనేందుకు నిదర్శనగా నిలిచాడు ఈ 'నాన్న'!
తైవాన్ నటుడు, గాయకుడు టినో బావో తనకు దూరమైన 22 ఏళ్ల కూతురు రూపాన్ని, గాత్రాన్ని కుత్రిమ మేధ ఏఐ సాంకేతికతో రూపొందించాడు. తన భార్యకు గర్భసోకాన్ని తీర్చాడు. చెప్పాలంటే ఆమెకు ఒక కొత్త ఆశను కల్పించాడు. తన కూతురు ఎక్కడికో వెళ్లిపోలేదు ఇక్కడే ఉందనే చిన్ని ఆశను రేకెత్తించాడు. ఈ 56 ఏళ్ల నటుడు టినో బావో తన కుమార్తె బావో రాంగ్ డిజిటల్ వెర్షన్ వీడియో క్లిప్‌ని నెట్టింట విడుదల చేశాడు. అందులో ఆమె తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ..ఐ మిస్ యూ డాడ్ అండ్ మామ్ అంటున్న మాటాలు వినిపిస్తాయి.
అందులో ఆమె చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా ఉంటుంది. ఇది చూసి ఆమె తల్లి చాలా భావోద్వేగానికి గురవ్వుతుంది. పైగా అచ్చం మన కూతురు బావో రాంగ్‌లా ఉందేంటీ అని ఉద్వేగంగా తన భర్త బావోని అడుగుతుంది. దానికి నటుడు బావో అది మన కూతురే కాబట్టి అని సమాధానమిస్తాడు. నిజానికి ఈ జంట కూతురు పోయిన దుఃఖంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు. ఏదైనా మాట్లాడితే కూతురు లేదనే విషయం గుర్తొచ్చి బాధపడాల్సి వస్తుందని మాట్లాడుకోవడమే మానేశారు ఆ దంపతులు.
ఏఐ సాంకేతికతో రూపొందించిన ఈ డిజటల్ కుమార్తె వాళ్లిద్దర్నీ మళ్లీ తిరిగి మాట్లాడుకునేలా చేసింది. ఈ మేరకు బావో మాట్లాడుతూ.."నా కూతురు 22 ఏళ్ల వయసులో అరుదైన రక్త వ్యాధితో మరణించింది. నా కూతురు చివరి రోజుల్లో ట్రాచల్ ఇంట్యూబేషన్ కారణంగా గొంతును కూడా కోల్పోయింది. ఆమె చనిపోయేంత వరకు మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఈ ఘటనే తనను కూతురుని కళ్లముందు ఉండేలా చేయడం ఎల? అనే ఆలోచనకు తెరతీసింది. అదే అతడిని ఈ కృత్రిమ మేధస్సు ఏఐని అధ్యయనం చేసేందుకు దారితీసింది.
తన ఏకైక బిడ్డను డిజిటల్‌గా పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఇంతటి ఆవేదన మధ్య ఏఐలో పీహెచ్‌డీ చేశాను. ఆ తర్వాత నా కుమార్తెను డిజటల్‌గా రూపొందించేందుకు సూపర్ బ్రెయిన్ అనే మెయిన్‌ల్యాండ్ కంపెనీ బృందంలో పనిచేశాను. అయితే కుమార్తె చిత్రాన్ని డిజిటల్‌గా రూపొందించడంలో ఇబ్బంది లేదు ఎందుకుంటే ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. కేవలం ఆమె వాయిస్‌ని రూపొందించేందుకే శ్రమ పడ్డాను. ఎందుకంటే..? ఆమె ఆ వ్యాధి కారణంగా గొంతును కోల్పోయింది. దీంతో నా కూతురు ఆఖరి ఘడియల వరకు మాతో ఏం మాట్లాడలేకపోయింది.
అందువల్ల నా కుమార్తె తన తల్లితో వీడియో కాల్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మూడు ఆంగ్ల వాక్యాలను మాత్రమే ఉపయోగించి వాయిస్‌ని క్రియేట్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. దాని ఫలితమే ఈ డిజటల్ కుమార్తె వీడియో క్లిప్. ఇది నన్ను నా భార్యను మళ్లీ దగ్గరకు చేసింది. ఈ ఐఏ సాంకేతికతో మా కూతుర్ని మళ్లీ పొందేలా చేసింది. కొంత ఉపశమనం కలిగించింది." అని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు బావో. అయితే బావోకి కూతురంటే ఎంత ప్రేమంటే..ఆమెకు బావో జుట్టుని ముట్టుకోవడం ఇష్టం అందుకని ఆమె తాకిన జుట్టుని అలానే ఉంచాలన్న ఉద్దేశ్యంతో కత్తిరించుకోవడం మానేశాడు. అలాగే ఆమె మరణించిన తర్వాత ఆమె శరీరంలోని ఎముకను కూతురు గుర్తుగా మెడలో గొలుసుగా వేసుకున్నాడు. ప్రేమ ఎంతటి ఘనకార్యాన్నైనా చేయిస్తుందనడానికి ఈ నాన్న ప్రేమే ఉదహారణ కదూ!.
(చదవండి: నో స్మోకింగ్ డే ఆ వ్యసనానికి చెక్‌పెట్టే ఆహార పదార్థాలివే!)
Comments
Please login to add a commentAdd a comment