
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో కన్నబిడ్డలను హత్య చేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రామ్‌కుమార్ తాజాగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మంగళవారం ఉదయం రామ్‌కుమార్ భార్య, భర్తల మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. శిరిష తన బంగారాన్ని తీసుకురావాలని భర్తతో వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్ర ఆవేశంతో ఊగిపోయిన రామ్‌కుమార్ భార్యపై చేయిచేసుకున్నాడు.
ఆ తర్వాత క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లి బావిలో పడేశాడు. ఆ తర్వాత గ్రామంలోకి వెళ్లి తన పిల్లలను బావిలో పడేసినట్లు తెలిపాడు. దీంతో గ్రామస్తులు వెంటనే బావి దగ్గరకు చేరుకుని, పిల్లలిద్దరిని బయటకు తీశారు. అప్పటికే పిల్లలిద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో రామ్‌కుమార్ అక్కడి నుంచి పారిపోయి మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు.