
జిల్లా ఏజెన్సీలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. రోజు సేవించే కల్లు ఎలా కల్తీకి గురైందనే విషయం అంతు చిక్కకుండా ఉంది.
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా ఏజెన్సీలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. రోజు సేవించే కల్లు ఎలా కల్తీకి గురైందనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.