టెక్సాస్: అమెరికాలోకి టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా టెక్సాస్‌ను వరదలు ముంచెత్తాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
కాగా, భారీ వర్షాల కారణంగా అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 600 మంది ప్రజలను సహాయ సిబ్బంది రక్షించారు. నాలుగు నెలల్లో కురువాల్సిన వానలు ఒక్కవారంలోనే పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయని అధికారులు వెల్లడించారు. ఇక, వర్షాల కారణంగా ఒక్క చిన్నారి మృతి చెందినట్టు సమాచారం.
వరదల కారణంగా వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. వరదలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment