ఫ్రిస్కో సిటీ పార్క్స్‌ బోర్డు మెంబర్‌గా వేణు భాగ్యనగర్‌ | Venu Bhagyanagar Is Appointed As Member Of Parks Recreation Board | Sakshi
Sakshi News home page

ఫ్రిస్కో సిటీ పార్క్స్‌ బోర్డు మెంబర్‌గా వేణు భాగ్యనగర్‌

Published Thu, Oct 7 2021 3:03 PM | Last Updated on Thu, Oct 7 2021 3:07 PM

Venu Bhagyanagar Is Appointed As Member Of Parks Recreation Board - Sakshi

ఫ్రిస్కో (టెక్సాస్‌) : ఫ్రిస్కో సిటీకి సంబంధించిన పార్క్స్‌ రిక్రియేషన్‌ బోర్డు సభ్యుడిగా భారతీయుడైన వేణు భాగ్యనగర్‌ ఎన్నికయ్యారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన పార్క్స్‌ రిక్రియేషన్‌ బోర్డు నగర పరిధిలో ఉన్న పార్కుల సంరక్షణ, అభివృద్ధి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఫ్రిస్కో సిటీ కౌన్సిల్‌కి అనుబంధంగా ఈ బోర్డు పని చేస్తుంది.

వేణు భాగ్యనగర్‌ స్వగ్రామం కరీంనగర్‌ జిల్లా చేగుర్తి. ఆ జిల్లాలోనే డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. 

చదవండి: టెక్సాస్‌లో శ్రీశ్రీకి ఘన నివాళి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement