ఎలన్ మస్క్ ది రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్...! ఎలక్ట్రిక్ కార్లు, శాటిలైట్ ఇంటర్నెట్, రియూజబుల్ రాకెట్ బూస్టర్లతో సంచలన విజయాలను నమోదు చేశాడు ఎలన్ మస్క్. తాజాగా టెక్సాస్‌లో జరిగిన సైబర్ రోడియో గిగా ఫ్యాక్టరీ లాంచ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. రానున్న రోజుల్లో సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ క్యాబ్స్‌ను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.
రోబోటాక్సీలతో సులువుగా సులభంగా..!
సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ క్యాబ్ ‘రోబోటాక్సీ’ సేవలను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. రోబోటాక్సీలతో ప్రయాణాలు సులభంగా, సులువుగా అవుతాయని మస్క్ అభిప్రాయపడ్డారు. కాగా రోబో టాక్సీలు వచ్చే సమయాన్ని మాత్రం ప్రకటించలేదు. టెక్సాస్‌లోని సైబర్ రోడియో గిగా ఫ్యాకరీ ప్రారంభోత్సవం సందర్భంగా రోబోటాక్సీలపై ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. “నేను చెప్పగలిగేది ఒక్కటే, మనం భవిష్యత్తులో ఎవరు ఊహించని స్థాయికి వెళ్లపోతున్నాం. మానవజాతి చరిత్రలో ఏ కంపెనీ కూడా సాధించని స్థాయి చేరుకుంటాం. త్వరలోనే సెల్ఫ్ ఆటోనామస్ డ్రైవింగ్ రోబోటాక్సీలు అందుబాటులోకి వస్తాయి. వాటితో ప్రపంచంలో సమూల మార్పులు రావడం ఖాయమ’’ని మస్క్ అన్నారు. కాగా రోబోటాక్సీలను 2019లో ప్రకటించగా ఇప్పుడు అవి ఆచరణలోకి వస్తాయని ఎలన్ మస్క్ పేర్కొన్నారు.
కౌబాయ్ టోపీతో కారులో ఎంట్రీ..!
టెక్సాస్‌లో సైబర్ రోడియో గిగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ఎలన్ మస్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కౌబాయ్ టోపీ, సన్ గ్లాసెస్ ధరించి కారులో ఎంట్రీ ఇచ్చాడు. టెక్సాస్ గిగా ఫ్యాక్టరీను లాంచ్ చేశాడు. ఈ ఈవెంట్‌లో ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబో గురించి కూడా ప్రస్తావించారు. కాగా కొద్ది రోజుల క్రితమే ట్విటర్‌లో 9 శాతం వాటాలను కొనుగోలు చేసి ట్విటర్ బోర్డులో కూడా ఎలన్ మస్క్ నియమితుడయ్యాడు. ట్విటర్‌లో సమూల మార్పులను తెచ్చేందుకు ఎలన్ మస్క్ పునుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: ఎలన్ మస్క్ మాయ.. అడుగుపెట్టాడో లేదో ట్విటర్‌పై కాసులవర్షం..!
Comments
Please login to add a commentAdd a comment