![Elon Musk Is Planning To Build His Own Private Airport In Texas - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/31/elonmusk.jpg.webp?itok=Mgf4iT0i)
ప్రపంచ అపర కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకొక సొంత ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే వందల ఎకరాల్లో ఎయిర్ పోర్ట్‌ను నిర్మించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఎలాన్ మస్క్‌కు చెందిన పలు సంస్థల కార్యకలాపాలన్నీ టెక్సాస్‌లోనే జరుగుతున్నాయి. స్పేస్ ఎక్స్, బోరింగ్ కంపెనీతో పాటు గతేడాది డిసెంబర్ నెలలో టెస్లా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మస్క్ సిలికాన్ వ్యాలీకి తరలించారు. ఈ తరుణంలో తన బిజినెస్ కార్యకలాపాల్ని వేగవంతం చేసుకునేందుకు టెక్సాస్‌లోని బాస్ట్రాపో సమీపంలో ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం పనులు వేగం వంతం చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి.
మస్క్‌కు వేల ఎకరాలు
ఎలాన్ మస్క్‌కు సెంట్రల్ టెక్సాస్‌లో వందల ఎకరాల భూములున్నాయి. అవి కాకుండా గిగా టెక్సాస్ కోసం 2,100 ఎకరాలున్నాయి. గతంలో స్పేస్‌ఎక్స్, బోరింగ్ కంపెనీ నిర్మాణల కోసం మరికొన్ని వందల ఎకరాల భూమిని సేకరించినట్లు తెలుస్తోంది.
అయితే ఆస్టిన్ సమీపంలో ఉన్న తన సొంత ల్యాండ్‌లో మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ నిర్మించనున్నారని, ఆ ఎయిర్ పోర్ట్‌ను ఎన్ని వందల ఎకరాల్లో నిర్మిస్తున్నారనే అంశంపై స్పష్టత లేదు. కానీ ఇప్పటికే ఆస్టిన్‌లో ఉన్న ఎగ్జిటీవ్ ఎయిర్‌పోర్ట్ 585 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. అదే తరహాలో నిర్మిస్తారా లేదంటే తక్కువ విస్తీర్ణయంలో నిర్మిస్తారా' అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment