టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు తరువాత రోజుకో అంశం తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే మస్క్ టెస్లా షేర్లు అమ్మి, రుణాలు తీసుకొని మరి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ట్విటర్ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను తొలగించేలా ట్విటర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ నిర్ణయం తీసుకుంటున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో అంశం ట్విటర్ సంస్థలో ఆసక్తికరంగా మారింది. అదే ట్విటర్ ఆఫీస్‌ను షిప్ట్ చేయడం?
ట్విటర్ కొత్త బాస్ ఎలన్ మస్క్‌కు ఓ రైతు బంపరాఫర్ ప్రకటించారు. ట్విటర్ కొనుగోలు తరువాత టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరానికి చెందిన రైతు జిమ్ స్క్వెర్ట్నర్..మస్క్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. కాలిఫోర‍్నియాలో ఉన్న ట్విటర్ ఆఫీస్‌ను టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరానికి మారిస్తే విలియమ్‌సన్ కౌంటీలో ఉన్న తన 100 ఎకరాల ల్యాండ్‌ను ఉచితంగా ఇస్తానని తెలిపాడు.
జిమ్ ష్వెర్ట్‌నర్ 1946 నుండి టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో పశువుల్ని పెంపకంతో పాటు కాపిటల్ ల్యాండ్ అండ్ లైవ్‌స్టాక్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రైతుకు 20వేల ఎకరాల భూమి ఉంది. అయితే టెక్సాస్‌లో ఉన్న ఈ ప్రాంతంలో పత్తి, మొక్కజొన్న, జొన్న, వరి, గోధుమల్ని పండిస్తారు. ట్విటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం. తాను ఇస్తానన్న 100 ఎకరాల ల్యాండ్ ఆస్టిన్ నుంచి గంట జర్నీ చేస్తే విలియన్సన్ కౌంటీకి చేరుకోవచ్చని రైతు ట్విట్‌లో పేర్కొన్నాడు.
మరోవైపు రైతు ష్వెర్ట్‌నర్ ఇచ్చిన ఆఫర్‌కు ఎలన్ మస్క్‌కు నచ్చితే ట్విటర్ ఆఫీస్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మార్చడం పెద్ద కష్టమేమీ కాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుంటే మస్క్‌కు చెందిన మూడు కంపెనీలు టెక్సాస్ రాష్ట్రంలోనే ఉన్నాయి. టెస్లా ప్రధాన కార్యాలయం ఆస్టిన్‌లో ఉంది. స్పేస్ ఎక్స్ బోకా చికా, దిబోరింగ్ కంపెనీ ప్లుగర్విల్లే నగరంలో ఉంది. ఈ మూడు ప్రాంతాలు టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ట్విటర్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మారిస్తే కార్యకాలపాలకు ఈజీగా ఉంటుందనేది మరికొందరి వాదన. వారి వాదనలు ఎలా ఉన్నా.. రైతు ఆఫర్‌పై మస్క్ ఇంతవరకు స్పందించలేదు.
ష‍్వెర్టనర్ ఆఫర్‌పై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ స్పందించారు. టెక్సాస్‌లో నివాసం ఉండే ష్వెర్ట్‌నర్ ట్విటర్‌ను తరలించేందుకు మస్క్‌కు 100 ఎకరాల ల్యాండ్‌ను ఉచితంగా అందిస్తారు. నేను ఫ్రీ స్పీచ్ జోన్‌గా ప్రకటిస్తా. ట్విటర్ కార్యాలయం షిప్ట్ అయితే ట్విటర్‌ను టెక్సాస్‌గా మార్చుకోవచ్చు. దీని గురించి ఆలోచించు ఎలన్ మస్క్ అంటే మస్క్ ట్విటర్‌కు ట్యాగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment