అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెక్సాస్‌లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. లెవిస్‌విల్లేలోని Mac స్పోర్ట్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరిగింది. నాట్స్ ప్రో కప్, నాట్స్ అడ్వాన్స్‌డ్ కప్, నాట్స్ ఇంటర్మీడియట్ కప్ విభాగాల్లో వాలీబాల్ పోటీలు జరిగాయి. ప్లేయర్స్ పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్‌లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
యూత్‌ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఆద్యంత్యం ఆకసక్తిగా సాగింది. నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్‌ను దిగ్విజయంగా నడిపించిన ప్రతిఒక్కరికి నాట్స్ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ తెలుగు వేడుకలు మార్చి 15,16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. డల్లాస్‌లోని అలెన్ ఈవెంట్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరు డల్లాస్ తెలుగు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
(చదవండి: లండన్‌లో యాత్ర 2 సక్సెస్ మీట్)
Comments
Please login to add a commentAdd a comment