శాన్ఎన్‌టానియోలో నాట్స్ ఉదారత | NATS distributes Masks to over 1000 front line workers battling corona virus | Sakshi

శాన్ఎన్‌టానియోలో నాట్స్ ఉదారత

Published Sat, May 2 2020 8:53 AM | Last Updated on Sat, May 2 2020 8:56 AM

NATS distributes Masks to over 1000 front line workers battling corona virus - Sakshi

టెక్సాస్ : ప్రాణాలు తెగించి కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు తమ వంతు సాయం చేయాలని నాట్స్ సంకల్పించింది.  శాన్ఎన్‌టానియోలో నాట్స్, లైఫ్ కేర్ ఫార్మసీ సంయుక్తంగా 1000 మాస్కులను ఫ్రంట్ లైన్ సపోర్టర్స్‌కు ఉచితంగా అందించాయి. ఇందులో 200 సర్జికల్ మాస్కులు, 20 ఎన్95 మాస్కులు, స్థానికంగా ఉండే వైద్యుల కోసం పంపిణి చేసింది. దీంతో పాటు డాక్టర్ చెరుకు మెడికల్ ఆఫీస్‌కు 100 సర్జికల్ మాస్కులను ఉచితంగా అందించింది. మరో 500 సర్జికల్ మాస్కులను శాన్ఎన్‌టానియోలోని వివిధ మెడికల్ ఆఫీసులకు పంపిణి చేసేందుకు స్థానిక తెలుగు సంఘం తెలుగు అసోషియేషన్ ఆఫ్ శాన్ఎన్‌టానియోకి అందించింది.

వచ్చేవారం అగ్ని మాపక సిబ్బంది, పోలీసులకు మరిన్ని మాస్కులను అందించాలని నాట్స్, లైఫ్ కేర్ ఫార్మసీ నిర్ణయించుకున్నాయి. ఉచితంగా మాస్కులు అందించడానికి ముఖ్యంగా నేనుసైతం అంటూ ముందుకొచ్చిన లైఫ్ కేర్ ఫార్మసీ యజమాని ప్రేమ్ కలిదిండికి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. మాస్కుల కొరత వేధిస్తున్న ఈ తరుణంలో ఇలా ఉచితంగా మాస్కులు అందించడం పట్ల వైద్యులు, మెడికల్ సిబ్బంది, నాట్స్, లైఫ్ కేర్ ఫార్మసీలను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement