vollyball
-
టెక్సాస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్!
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెక్సాస్‌లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. లెవిస్విల్లేలోని Mac స్పోర్ట్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరిగింది. నాట్స్ ప్రో కప్, నాట్స్ అడ్వాన్స్డ్ కప్, నాట్స్ ఇంటర్మీడియట్ కప్ విభాగాల్లో వాలీబాల్ పోటీలు జరిగాయి. ప్లేయర్స్ పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. యూత్‌ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఆద్యంత్యం ఆకసక్తిగా సాగింది. నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్‌ను దిగ్విజయంగా నడిపించిన ప్రతిఒక్కరికి నాట్స్ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ తెలుగు వేడుకలు మార్చి 15,16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. డల్లాస్‌లోని అలెన్ ఈవెంట్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరు డల్లాస్ తెలుగు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. (చదవండి: లండన్‌లో యాత్ర 2 సక్సెస్ మీట్) -
వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ ఆడుతున్న ఓ బాలుడు గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ సంఘటన మెఘల్‌పుర పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఎస్ఐ ముఖేశ్ తెలిపిన మేరకు.. ఆలిజాకోట్లా ప్రాంతానికి చెందిన నవాజ్ అహ్మద్ (14) నవాజ్ అహ్మద్ ఆలిజాకోట్లా అంధేరీ గల్లీలో ఉండే గ్రౌండ్‌కు వెళ్లి తోటి స్నేహితులతో వాలీబాల్ ఆడాడు. వాలీబాల్ ఆడుతుండగానే ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వైద్యుల ప్రాథమిక నివేదిక ప్రకారం నీరసం వల్ల కళ్లు తిరిగి పడిపోవడంతో మరణించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఇద్దరు యువకుల నడుమ జరిగిన ఘర్షణతో మృతిచెందినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం సాధారణ మరణంగా తేల్చారు. -
వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట
రేక్సావిక్: ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్సావిక్కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేక్సానెస్ అగ్నిపర్వతం ఈ నెల 28న బద్ధలైంది. దీంతో పర్వతంలో నుంచి పెద్ద ఎత్తున లావా బయటకు వస్తోంది. అయితే ఆ లావా వేడి తీవ్రత తక్కువగానే ఉండటంతో పర్యాటకులు కాస్త దాని దగ్గరగా వెళ్లి పరిశీలించే అవకాశం కలుగుతోంది. ఆదివారం చాలా మంది హైకర్లు, సందర్శకులు అక్కడికెళ్లి దాన్ని పరిశీలించారు. పర్యాటకలు అగ్ని పర్వతం వద్ద సెల్పీలు దిగుతున్నారు. తాజాగా అగ్ని పర్వతం వద్ద కొంత మంది యువకులు సరదగా వాలీబాల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్ ఐనార్స్డోట్టిర్ అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో వాలీబాల్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘అగ్నిపర్వతం వద్ద యువకులు సరదగా వాలీబాల్ ఆడుతున్నారు’ అని ఆమె కామెంట్ జతచేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను పదిలక్షల మంది వీక్షించారు. ఆమె మరో వీడియోను షేర్ చేసి.. ‘ ఉదయం ఆగ్ని పర్వతం వద్ద కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది’ అని కామెంట్ చేశారు. ఈ వీక్షించిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘చాలా అద్భుతం’, ‘అక్కడ ఆటలు ఆడటాన్ని నిషేధిస్తారు.. జాగ్రత్త’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. People casually playing volleyball at the #volcano in #Fagradalsfjall, #Iceland yesterday 🌋 Mögulega það íslenskasta sem ég hef séð. pic.twitter.com/nU3VeDqziR — Rut Einarsdóttir (@ruteinars) March 28, 2021 -
వైరల్ ఫొటో: ఈ అమ్మకు సలాం...!!
చంటిబిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది.. అందుకే తన ఏ చోట ఉన్నా.. బిడ్డ ఆకలిని తీర్చేందుకు తల్లి వెనుకాడదు. అమృతం వంటి చనుబాలు అందించి తనను లాలిస్తుంది. మిజోరాంకు చెందిన లాల్వేంట్లుంగాని కూడా అలాంటి తల్లే. అందుకే వాలీబాల్ ఆటల పోటీ మధ్యలో కాస్త విరామం దొరకగానే తన పాపాయికి పాలుపట్టి మాతృత్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను నింగ్లిన్ హంగల్ అనే నెటిజన్ ఫేస్బుక్లో షేర్ చేశారు. ‘ ఆట మధ్యలో తన ఏడు నెలల బుజ్జాయి ఆకలి తీర్చేందుకు ఓ తల్లి పాలుపట్టిన క్షణం. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆట పట్ల ఆ తల్లి అంకిత భావాన్ని... నలుగురిలో బిడ్డకు పాలు పట్టిన ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. క్రీడాకారిణిగా, ఓ తల్లిగా రెండు బాధ్యతలు ఒకేసారి నిర్వహించిన ఆమెకు జేజేలు పలుకుతున్నారు’ అని నింగ్లిన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో లాల్వేంట్లుంగాని ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.. ‘ఆ అమ్మకు సలాం’ అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. కాగా లాల్వేంట్లుంగాని మిజోరాంకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి. టికుమ్ నియోజకవర్గానికి చెందిన వాలీబాల్ జట్టు సభ్యురాలిగా ఉన్న ఆమె రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఐజ్వాల్‌లో జరిగిన పోటీల్లో ఆమె ఈ విధంగా బిడ్డకు పాలుపట్టారు. ఇక ఈ ఫొటో మిజోరాం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమావియా రోటే దృష్టికి రావడంతో ఆయన లాల్వేపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు రూ. 10 వేలు బహుమానంగా ప్రకటించారు. Mizoram State Games ‘19 chu tan a na tlang a ni e....Ms Lalventluangi Tuikum Bial Volleyball Player pawhin chawlh lawk remchanga lain a naute thla 7 leka upa chu a hnute a hnek tir e!! Ms Veni a ngaihsanawm em vangin Rs 10,000/- in puih kan tum e. MSG tiropuitu a ni ngei e! pic.twitter.com/QHJ4tEmtQt — Robert Romawia Royte (@robertroyte) December 9, 2019 -
మేరీల్యాండ్‌లో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్
మేరీల్యాండ్ : అమెరికాలోని మేరీల్యాండ్‌లో కేఎల్ఏపీ సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా అక్టోబరు 26 న నిర్వహించిన వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా జరిగాయి. పురుషులకు వాలీబాల్ మహిళలకు త్రోబాల్ క్రీడలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వాలీబాల్‌కు 20 జట్లు, త్రోబాల్‌కు 10 జట్లకు గాను మొత్తం 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.30 కు ప్రారంభమైన ఈ పోటీలను రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించారు. ఈ పద్దతిలో ప్రతీ గ్రూప్‌లో టాప్కు చేరిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలలో వాలీబాల్ విజేతగా న్యూయార్క్ స్పైకర్స్ నిలిచింది. రన్నరప్‌గా వాషింగ్టన్ కింగ్స్ నిలిచింది. టీమ్ స్ట్రైవ్ మూడో స్థానానికి పరిమితమయ్యింది. ప్రేక్షకులు అత్యధిక సంఖ్యలో హాజరై తమ మద్ధతును తెలిపారు. రాత్రి 9.30కి పోటీలు ముగిశాయి. ఈ టోర్నమెంట్‌కి సహకరించిన ఇండియన ప్యారడైజ్ కూషన్ హోటల్ ఎమ్‌డి జిన్ఓక్కు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే స్పాన్సర్లు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. -
రాష్ట్ర స్థాయి వాలీబాల్‌కు బొల్లేపల్లి విద్యార్థులు
కట్టంగూర్ : రాష్ట్రస్థాయి వాలీబాల్ అండర్–14 విభాగంలో మండలంలోని బొల్లేపల్లి ౖహె స్కూల్ విద్యార్థులు ఏ.నిఖిత, జి.విజయ, అండర్–17 విభాగంలో కె.శ్రావణి, వి.ఐశ్వర్య ఎంపికైనట్లు ఇన్చార్జి ఎంఈఓ పర్నె చంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14 విభాగంలో ఎంపికైన విద్యార్థులు ఈనెల 25న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాల పీఈటీ సి.హెచ్ బ్రహ్మయ్య, ఉపాధ్యాయులు నరేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, యాదయ్య, అన్నపూర్ణ, బాబురావులు, ధర్మాంగ్ అభినందించారు.