
Texas man shocked after his Covid test bill: తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తి తనకు కరోనా ఉందేమో అనుకొని టెస్టుకు వెళ్లాడు. తరువాత అతను షాక్‌కు గురయ్యాడు. అయితే ఆ వ్యక్తి అంతలా కంగుతినడానికి కారణం..వచ్చిన రిజల్ట్స్‌ను బట్టి కాదు.. ఆసుపత్రి వారు వేసిన బిల్‌ను చూసి..
వాషింగ్టన్: దాదాపు గత రెండేళ్ల నుంచి సాధారణ జ్వరం, జలుబు వచ్చిన కరోనానేమో అని కంగారు పడిపోతున్నాం. పక్కన ఎవరైన దగ్గుతూ, తుమ్ముతూ కనిపిస్తే ఇంకేమైనా ఉందా మెల్లగా పక్కకు జారుకుంటాం. ఒకవేళ ఇవే లక్షణాలన్నీ మనకే ఉంటే ఉన్నపళంగా టెస్టులు, మందులు అంటూ హైరానా పడిపోతాం. కోవిడ్‌కు అనేక చోట్ల టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం కొంత డబ్బులు తీసుకొని పరీక్షలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తి తనకు కరోనా ఉందేమో అనుకొని టెస్టుకు వెళ్లాడు. తరువాత అతను షాక్‌కు గురయ్యాడు. అయితే ఆ వ్యక్తి అంతలా కంగుతినడానికి కారణం..వచ్చిన రిజల్ట్స్‌ను బట్టి కాదు.. ఆసుపత్రి వారు వేసిన బిల్‌ను చూసి.. అసలేం జరిగిందంటే..
చదవండి: మాంచెస్టర్‌లో మహారాష్ట్ర కుర్చీ.. 7000 కి.మీ ఎలా ప్రయాణించిందంటే?
టెక్సాక్‌కు చెందిన ట్రెవిస్ వార్నర్ అనే వ్యక్తి కరోనా టెస్టులు చేయించుకున్నారు. పీసీఆర్ టెస్టులు చేయించుకున్న వార్నర్‌కు ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా 54 వేల డాలర్లు బిల్లు వేసింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.40 లక్షలు. దీంతో వార్నర్ షాక్ అయ్యాడు. ఇందులో పీసీఆర్ టెస్టులు, యాంటిజెన్ టెస్ట్ ఫెసిలిటీ ఫీజు కోసం కలిసి భారీగా వసూలు చేశారు. ఇంత మొత్తం బిల్లు వేయడం చూసి వార్నర్ ఖంగుతిన్నాడు. అయితే, అతనికి మోలీనా హెల్త్‌కేర్ నుంచి ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ బిల్లును సదరు కంపెనీకి పంపాడు. ఆ బిల్లుచూసి ఇన్సూరెస్ కంపెనీ సైతం షాక్ అయి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి బిల్లును 54 వేల డాలర్ల నుంచి 16,915 డాలర్లకు తగ్గించి చెల్లించింది.
చదవండి: Ankita Konwar: వృక్షాసనం నాకు చాలా స్పెషల్.. ఎందుకంటే?
ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతోంది. కాగా అమెరికాలో ఇలా ఇష్టారీతిన డబ్బులు గుంజడం ఇదేం తొలిసారి కాదు. కోవిడ్ అవతరించినప్పటి నుంచి టెస్టుల కోసం అధిక ధరలు వసూలు చేసిన సందర్భాలు చాల ఉన్నాయి. సాధారణంగా పీసీఆర్ టెస్టు కోసం అమెరికాలో 8 నుంచి 15 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది.
What is wrong w the US?
— Michael Mina (@michaelmina_lab) October 1, 2021
This guys bill for a few tests came to $54,000!!!
His wife’s insurance negotiated her cost down to $1000!!
PCR tests themselves can cost <$5.
Add some labor and overhead and you’re up to $8-15 (generously)
This is horrible.https://t.co/5GdAXX1EZ0