
సారా బీమ్
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యారిస్ కౌంటీలో సారా బీమ్ (41) అనే టీచర్ కోవిడ్ సోకిందనే భయంతో 13 ఏళ్ల కుమారుడిని కారు డిక్కీలో పడుకోబెట్టి టెస్టింగ్ కేంద్రానికి తీసుకెళ్లిన ఘటనలో మరికొన్ని వివరాలు వెలుగు చూశాయి. కోవిడ్ పరీక్ష కేంద్రం వద్ద అధికారులు కారు డిక్కీలో ఉన్న కుమారుడిని బయటకు తీయాలని కోరగా నిరాకరించిన సారా అక్కడి నుంచి కారుతో సహా పరారైన విషయం తెలిసిందే.
చదవండి: కోవిడ్ భయంతో కుమారుడిని డిక్కీలో కుక్కింది
అయితే, కారు డిక్కీలో కుక్కి పడుకోబెట్టినప్పటికీ బాలుడికి ఎటువంటి హాని జరగలేదని, అతడు క్షేమంగానే ఉన్నాడని సైఫెయిర్ డిస్ట్రిక్ట్ పోలీస్ విభాగం తెలిపింది. సారా బీమ్‌పై ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా, సారాను బలవంతపు సెలవుపై పంపిస్తున్నట్లు ఆమె పనిచేసే సైప్రెస్ ఫాల్స్ హైస్కూల్ యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment