వయసు శరీరానికే గానీ మనసుకు కాదు అని చేసి చూపిస్తున్నారు కొందరూ. చాలామంది వయసు రీత్యా పెద్దవారైనా.. యువకుల మాదిరిగా తమకు ఇష్టమైన రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్నారు. అలానే ఓ మహిళ ఏడు పదుల వయసులో తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. పైగా ఈ వయసులో ఇలాంటి పోటోల్లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించింది. ఈ పోటీలో ఆమె గెలవకపోయినప్పటికీ అంత పెద్ద వయసులో కూడా తన కోరికను నెరవేర్చుకునేందుకు ముందుకు వచ్చి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు అందానికి వయసుతో సంబంధం లేదని చాటి చెప్పింది. ఎవరామె అంటే..
ఏడు పదుల వయసులో మారిస్సా టీజో అనే మహిళ మిస్ టెక్సాస్ యూఎస్‌ఏ పోటీలో పాల్గొనాలనే తన కలను సాధించింది. గత వారాంతంలో హ్యూస్టన్‌లో జరిగిన ఈ మిస్ టెక్సాస్ ఈవెంట్‌లో పాల్గొన్న 75 మంది మహిళలో టీజో కూడా ఉన్నారు. ఈ ఈవెంట్‌లో ఆరియోన్నా వేర్ విజేతగా నిలిచినప్పటికీ..71 ఏళ్ల టీజోనే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పైగా ఈ ఏజ్‌లో పాల్గొన్న వృద్ధురాలిగా రికార్డు సృష్టించారు. ఇక టీజో తాను ఈ పోటీల్లో పాల్గొనడానికి గల కారణాలను ఇన్‌స్టాగ్రాం వేదికగా చెబుతూ..తాను ఈ మిస్ టెక్సాస్ యూఎస్‌ఏ పోటీలో పోటీదారుగా పాల్గొనడం అద్భుతమైన అనుభవంగా భావిస్తున్నాను.
అందులో తాను భాగమైనందుకు సంతోషిస్తాన్నాను. ఇది కేవలం మహిళలు తమ శారీరక, మానసికంగా ధృఢంగా ఉండటమేగాక వారు ఏ వయసులోనైనా అందంగానే ఉంటారని విశ్వసించేలా ప్రేరేపించేందుకే ఇలా చేశానని పోస్ట్‌లో తెలిపారు. అంతేగాదు తాను ఈ పోటీలో పాల్గొనేల మద్దతు ఇచ్చిన స్పాన్సర్‌లందరికి ధన్యవాదలని కూడా చెప్పారు. కాగా, ఇటీవలే అందాల పోటీల్లో వయోపరిమితి నిబంధనను తొలగించాలనే మార్పుకు శ్రీకారం చుడటంతోనే టీజోకి ఈ మిస్ టెక్సాస్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. అంతేగాదు ఈ సరికొత్త నిబంధన మార్పులో.. వివాహం చేసుకున్న లేదా వివాహితలు, గర్భణీ స్త్రీలు, పిల్లలు కలిగిన మహిళలు సైతం అందాల పోటీలో పాల్గొనడానికి అనుమతివ్వడం విశేషం. అయితే ఈ విధానం 2023 నుంచి అమలులోకి రావడం గమనార్హం.
(చదవండి: పెళ్లి వేడుకల్లో సోనాక్షి డ్రెస్సింగ్ స్టైల్ వేరేలెవెల్!..పూజకు అందరిలా..!)
Comments
Please login to add a commentAdd a comment