Gun Shooting At USA Texas High School Prom Party - Sakshi
Sakshi News home page

అమెరికాలో దారుణం.. ప్రోమ్‌ పార్టీపై కాల్పులు

Published Mon, Apr 24 2023 9:26 AM | Last Updated on Mon, Apr 24 2023 10:03 AM

Gun Shooting At USA Texas High School Prom Party - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇంట్లో జరుగుతున్న హైస్కూల్‌ ప్రోమ్‌ పార్టీపై కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో 9 మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. అమెరికాలోకి టెక్సాస్‌లో జాస్పర్‌ కౌంటీలో ఉన్న ఓ ఇంట్లో హైస్కూల్‌ ప్రోమ్‌ పార్టీ జరుగుతోంది. ఈ సందర్భంగా పిల్లలందరూ ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో ఓ దుండగుడు ప్రోమ్‌ పార్టీపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కాల్పుల్లో గాయపడిన వారంతా 15-19 ఏళ్ల మధ్య వారుగా తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ఇక, కాల్పల సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు జాస్పర్‌ కౌంటీ షరీష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, కాల్పలకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement