
టెక్సాస్: వరుసగా మూడో ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఆశించిన అమెరికా మేటి రెజ్లర్ జోర్డాన్ బరూస్‌కు నిరాశ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అమెరికా రెజ్లింగ్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో 32 ఏళ్ల జోర్డాన్ ఓడిపోయాడు. కైల్ డేక్‌తో జరిగిన 74 కేజీల విభాగం రెండు ఫైనల్స్‌లో జోర్డాన్ ఓటమి చవిచూశాడు. తొలి ఫైనల్లో కైల్ 3–0తో... రెండో ఫైనల్లో 3–2తో జోర్డాన్‌ను ఓడించి 74 కేజీల విభాగంలో అమెరికా తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో జోర్డాన్ 74 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. 2011, 2013, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పసిడి పతకాలు నెగ్గిన జోర్డాన్ 2014, 2018, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 200 బౌట్‌లలో పోటీపడిన జోర్డాన్ 14సార్లు మాత్రమే పరాజయం పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment