కళలతో ఒత్తిడి దూరం! | Stress away with the art | Sakshi
Sakshi News home page

కళలతో ఒత్తిడి దూరం!

Published Sun, Jun 19 2016 2:46 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

కళలతో ఒత్తిడి దూరం!

కళలతో ఒత్తిడి దూరం!

లండన్: మనకున్న నైపుణ్యాల స్థాయితో సంబంధం లేకుండా ఏదో ఒక కళలో నిమగ్నమవడం ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. యూకేలోని డ్రెక్సెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు మానవ ఉమ్మి నమూనాలోని కార్టిసాల్ అనే హార్మోన్ , ఒత్తిడికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. కార్టిసాల్ స్థాయులు ఎక్కువైనపుడు ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలున్నాయని గుర్తించారు.

ఈ అధ్యయనంలో భాగంగా 18 నుంచి 59 ఏళ్ల మధ్యనున్న 39 మందిని 45 నిమిషాల పాటు జరిగిన కళారూపాల తయారీకి ఆహ్వానించారు. కాగితం, మట్టి, ఇతర పరికరాలు వారికి అందుబాటులో ఉంచారు. పాల్గొన్నవారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా తమకిష్టమొచ్చిన వస్తువును తయారుచేయమన్నారు. ఈ 45 నిమిషాల కాలంలో 75 శాతం మందిలో కార్టిసాల్ స్థాయులు గణనీయంగా తగ్గిన ట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement