గత వందేళ్లలో రెండోసారి అత్యంత అరుదైన పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతులను కనుగొన్నారు. ఆ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొకవైపు సగం నీలం అంటే మరోవైపు మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. ఇది ఆడ, మగ లక్షణాను ప్రదర్శిస్తుంది. అటువంటి పక్షుల్లో ఒకవైపు మగ ఈకలు ఉండి అందుకు అనుగుణంగా పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి.
అలాగే మరొక వైపు స్త్రీ ఈకలు ఉండి స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అంతేగాదు ఈ పక్షిలో కణాలు ఆడ, మగ కణాలుగా విభజింపబడ్డాయట కూడా. ఇలా దాని జీవితాంతం కణాలు అలానే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫ్(ఆడ, మగ లక్షణాలు)ను చూడలేరన్నారు. ఈవిధంగా పక్షుల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లో ఇలాంటి పక్షిని తానింత వరకు చూడలేదని ఇది చాలా అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు.
ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆప్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. వందేళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు.
(చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!)
Comments
Please login to add a commentAdd a comment