ఈ శిలాజం 6 కోట్ల సంవత్సరాల కిందటి ఓ చేపది. అమెరికాలోని కన్సస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు రాబర్ట్ డీపాల్మా, ఆయన సహచరులు కలసి చాలా జీవులకు చెందిన అరుదైన శిలాజాలను వెలికితీశారు. 6 కోట్ల ఏళ్ల కిందట భూమిని ఓ గ్రహశకలం ఢీకొన్నప్పుడు దాదాపు 75 శాతం జంతు, వృక్ష జాతులు అంతరించిపోయాయి. ఈ విపత్తు వల్లే డైనోసార్లు కూడా అంతరించిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పలు జాతులకు చెందిన జంతువులు, చేపలు కూడా చనిపోయాయి. అవన్నీ శిలాజంగా మారి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. నార్త్ డకోటా ప్రాంతంలో దీన్ని పరిశోధకులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment