లేట్ నైట్ నిద్రపోతే అంతే సంగతులు!
మీ ఇంట్లో చిన్నపిల్లలు తరచూ నిరాశగా ఏదో కోల్పోయిన వారిలా ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంటున్నారా? వారు అలా ఉండడానికి కారణాలు ఏమై ఉండచ్చో ఒకసారి ఆలోచించారా! వారి విచిత్ర మానసిక పరిస్థితికి కారణం సరిగా నిద్ర పోకపోవడమే అని ఇటీవల శాస్త్రవేత్తలు తేల్చారు. లేట్ నైట్ వరకు నిద్రపోని పిల్లలు ఎమోషనల్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. నిద్ర తక్కువగా ఉన్నవారిలో వ్యతిరేక భావావేశాలు ఎక్కువగా ఉంటాయంట!
అలాంటి వారు సంతోషాలను ఎక్కువగా అనుభవించలేరని హోస్టన్ యూనివర్సిటీ నిపుణులు తెలిపారు. 7 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలపై పరిశోధనలు జరిపి ఈ మేరకు ఫలితాలను రాబట్టారు. భవిష్యత్తులో అలాంటి పిల్లలు మానసికంగా మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. నిద్రలేమి అనేది మానసిక స్థితిగతులపై అధికంగా ప్రభావం చూపుతుందని వివరించారు. కాగా, ఏడు నుంచి 12 ఏళ్ల పిల్లలు సుమారు రోజుకు 10 గంటల పాటు నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.