వాషింగ్టన్: ఫేస్‌బుక్ అధినేత మార్క్ జకర్‌బర్గ్ (33) హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచంలోని అతి పెద్ద సామాజిక నెట్ వర్క్‌కి అధిపతిగా ఉన్న జుకర్ 13 సం.రాల తరువాత చివరకు తన పట్టాను అందుకున్నారు. హార్వర్డ్‌లో చదువుకుని డ్రాప్ అవుట్‌గా బయటకు వెళ్లిన జుకర్‌బర్గ్ తిరిగి ఇదే యూనివర్సిటీ నుంచి గురువారం గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో యూనివర్శిటీని వీడి. తనఅద్భుతమైన ప్రతిభతో బిలియనీర్‌గా అవతరించిన 2017లో యూనివర్శిటీ స్నాతకోత్సవంగా ప్రసగించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి మాట్లాడిన జుకర్‌బర్గ్ కొత్త సవాళ్లను స్వీకరించి గొప్ప గొప్ప పనులు చేయాల్సి సమయం వచ్చిందన్నారు. కేవలం పురోగతి కోసమే కాదు మంచి ప్రయోజనాలకోసం మంచి కార్యక్రమాలు చేపడదాం. ఇక మన జేనరేషన్ వంతు వచ్చిందంటూ అనేక సూచనలు చేశారు.
ఆటోమేషన్ (యంత్రీకరణ) ఉద్యోగాలను తగ్గిస్తుందని ఫేస్‌బుక్ అధినేత పేర్కొన్నారుర. యంత్రీకరణ వల్ల లక్షల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని, భవిష్యత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లమూలంగా ఉద్యోగ కొరత ఏర్పడుతుందని కొత్త ఉద్యోగాన్వేషణ చేయాలని యువతకు సూచించారు. ఫేస్‌బుక్‌తో పాటు అనేక సంస్థలు అభివృద్ధి చేసిన టెక్నాలజీల తో భారీ ఉపయోగాలతో పాటు అనేక సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రపంచానికిఅవసరమైన టెక్నాలజీని వృద్ది చేయాలని జుకర్‌బర్గ్ చెప్పారు.
మరోవైపు ‘‘అమ్మా.. తిరిగి వచ్చి నా డిగ్రీని అందుకుంటానని ఎపుడూ చెబుతూ ఉండేవాడిని" అంటూ తన ఫేస్‌బుక్ పేజీలో తల్లిదండ్రులతో ఉన్న ఫోటోను ఒకదాన్ని షేర్ చేశారు.