ఇండియన్-అమెరికన్ విద్యార్థి హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ సభ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి శ్రుతి కుమార్ గాజా సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై చర్యపై నిరసన వ్యక్తం చేశారు. డజనుకు పైగా విద్యార్థుల డిప్లొమాలను తిరస్కరించే నిర్ణయంపై యూనివర్సిటీ నేతలను శ్రుతి విమర్శించారు.
క్యాంపస్‌లో వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించింది. విద్యార్థులు , అధ్యాపకులు మాట్లాడుతున్నా, హార్వర్డ్, మాట వినడం లేదంటూ మాట్లాడింది. ఉద్వేగభరిత హావ భావాలతో, ఆవేదనతో చేసిన ఈప్రసంగానికి కొంతమంది అధ్యాపకులతో సహా అక్కడున్న ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. క్యాంపస్‌లో చప్పట్లు మారుమోగిపోయాయి.
ఇంగ్లీషులో మాట్లాడేందుకు ఎంపికైన సీనియర్ స్పీకర్ శ్రుతి కుమార్, "ది పవర్ ఆఫ్ నాట్ నోయింగ్" పేరుతో సిద్ధం చేసిన ప్రసంగానికి బదులు మధ్యలో తాను రాసిపెట్టుకున్న మరో కాపీని తీసి ప్రసంగించడం మొదలు పెట్టింది. తానీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నందున, తన సహచరులను గుర్తించడానికి కొంత సమయం కేటాయించాలి అంటూ ఇజ్రాయెల్ ద్వారా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు అనుభవాలతోపాటు స్వయంగా తన అనుభవాలను కూడా పంచుకుంది.
అలాగే దక్షిణాసియా వలస కుటుంబంలో పుట్టి, అమెరికాలోని హార్వర్డ్‌లో చేరిన తొలి వ్యక్తిగా నెబ్రాస్కా నుండి హార్వర్డ్ దాకా తన ప్రయాణం గురించి వెల్లడించింది. ఒకరికి తెలియని వాటిని గుర్తించడంలోని విలువ గురించి, ఈ ఆలోచన ఎదుగుదలకు, సానుభూతికి ఎలా దారితీసిందో వివరించింది. 2024లో గ్రాడ్యుయేట్ చేయకుండా నిషేధం విధించిన 13 మంది అండర్ గ్రాడ్యుయేట్‌ల గురించి ప్రస్తావించడం అక్కడి వారిలో భావోద్వేగాన్ని నింపింది.
కాగా హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫ్యాకల్టీ వారికి డిగ్రీలు ఇవ్వడానికి అనుకూలంగా మెజారిటీ ఓటు ఉన్నప్పటికీ, పాలస్తీనాకు మద్దతుగా క్యాంపస్ నిరసనలలో పాల్గొన్న 13 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించారని హార్వర్డ్ క్రిమ్సన్ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment