వ్యాక్సిన్స్‌ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి, దారుణంగా! వీడియో వైరల్‌ | US Woman Fighting For Life After Vaccine Reaction At Hospital | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్స్‌ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి, దారుణంగా! వీడియో వైరల్‌

Published Thu, Sep 19 2024 4:43 PM | Last Updated on Thu, Sep 19 2024 5:40 PM

US Woman Fighting For Life After Vaccine Reaction At Hospital

మృత్యువుతో పోరాడుతున్న ఫ్లోరిడా యువతి

అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక యువతి  చికిత్స తీసుకుందామని వెళ్లి  ఇపుడు మరింత ప్రమాదంలో పడిపోయింది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సీన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది.  అంతేకాదు దీనికి సంబంధించిన ఖర్చులు భారీగా ఉండటంతో వైద్య నిధుల సమీకరణకు నానా బాధలుపడుతోంది. విషయం ఏమిటంటే..

ఫ్లోరిడాకు చెందిన 23 ఏళ్ల అలెక్సిస్ లోరెంజ్  పరోక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా (PNH)తో భాపడుతోంది. దీనికి చికిత్స కోసం కాలిఫోర్నియాలోని UCI మెడికల్ సెంటర్‌లో చేరింది.నివేదికల ప్రకారం, ఆమె చికిత్సను కొనసాగించే ముందు టెటనస్, మెనింజైటిస్ ,న్యుమోనియాకు టీకాలు వేయించుకోవాలిన ఆసుపత్రి  వైద్యులు కోరారు. అయితే  టీకాలు ఏకకాలంలో ఇవ్వడంతో భయంకరమైన రియాక్షన్‌ వచ్చింది. టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించింది. తాత్కాలిక అంధత్వం,దవడలు బిగుసుకుపోయాయి.  ఒళ్లంతా రక్తం పేరుకుపోయిన మచ్చలు. ఒక దశలో తల పగిలిపోతుందా అన్నంత బాధ. దీనికి తోడు వాంతులతో ఇబ్బంది పడుతోంది. ఫలితంగా ఆమెను ప్రత్యేక చికిత్స కోసం లాస్ ఏంజిల్స్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  లోరెంజ్‌కి కాలిఫోర్నియాలో ఆరోగ్య బీమా లేకపోవడం నిధులను సేకరించే  పనిలో ఉన్నారు ఆమె బంధువులు, స్నేహితులు. 

తన పరిస్థితిపై  లోరెంజ్  షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మె మొదట రక్త రుగ్మత కోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. రక్త మార్పిడి చేయించుకుంది. రక్తమార్పిడి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ,  పూర్తిగా  తగ్గలేదని ఆమె వాపోయింది. టీకాలు వేసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారని,  బలవంతంగా తీసుకున్న మూడు వ్యాక్సిన్‌ల కారణంగా  తన పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  మరోవైపు టీకాలు తీసుకున్న తర్వాత, ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటానికి దారితీసిందనికుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం  లోరెంజ్‌ నెమ్మదిగాకోలుకుంటోందని ఆమెకోసం కేటాయించిన స్పెషల్‌ నర్సు వెల్లడించారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement