ఎకో విలేజ్‌లో కలుషిత నీరు.. 200 మంది అస్వస్థత | Contaminated Water in Eco Village 2 | Sakshi
Sakshi News home page

ఎకో విలేజ్‌లో కలుషిత నీరు.. 200 మంది అస్వస్థత

Published Tue, Sep 3 2024 6:55 AM | Last Updated on Tue, Sep 3 2024 9:54 AM

Contaminated Water in Eco Village 2

న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఎకో విలేజ్- 2 సొసైటీలో కలుషిత నీరు తాగి, 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మహిళలు, పిల్లలు  అధికంగా ఉన్నారు. అధికారులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ నోయిడాలోని ఎకో విలేజ్- 2లో రెండు రోజుల క్రితం ట్యాంక్‌ను రసాయనాలతో శుభ్రం చేశారు. ఆ తరువాత ఈ ట్యాంకు నీటిని తాగిన 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ  ఉదంతం గురించి సొసైటీలో ఉంటున్న వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వాటర్ ట్యాంక్‌ను రసాయనాలతో శుభ్రం చేశారని, అయితే వాటర్ ట్యాంక్‌లో ఇంకా రసాయనం మిగిలి ఉందని, దాని కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం తాము బయటి నుంచి నీరు తెచ్చుకుని వినియోగించుకుంటున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement