మధుమేహం, లేదా షుగర్‌వ్యాధి వచ్చిందంటే నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతతాయి. ఒత్తిడి లేని జీవితం, జీవన శైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహార నిబంధనలు పాటిస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ అదుపులో ఉండేలా ఒక చిన్న చిట్కాను తెలుసుకుందాం.
శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.మధుమేహాన్ని వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. అందుకే మధుమేహం లక్షణాలు, జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలి. 2030 నాటికి మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ఏడోఅతిపెద్ద కిల్లర్‌గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.
శరీరంలో పాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆహారంలో ఉండే చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వ చేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ దీని పని. ఆహారం జీర్ణమైనప్పుడు అందులోని చక్కెర గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. ఈ గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా సమస్యే. అందుకే, ఆహార నిపుణులు సమతుల్య ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు.
కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శరీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది చిన్న వయస్సులోనే మధుమేహం బారినపడుతున్నారు.
కారణాలు
సరైన వేళల్లో భోజనం, నిద్ర లేకపోవడం మధుమేహానికి దారి తీస్తుంది.
వంశపారంపర్యంగా తల్లిదండ్రులు, ఇంకా ముందు తరం నుంచి కూడా టైప్-2 మధుమేహం వస్తోంది.
వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మధుమేహం రావచ్చు.
మధుమేహం మొత్తం మూడు రాకలు. టైప్-1, టైప్-2 ముఖ్యమైనవి. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని ‘గెస్టేషనల్’ అంటారు.
మెంతుల వాటర్
ఒక స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసుకోవడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా ఇది ఉపయోగపడుతుంది.
లేదంటే గ్లాసు నీటిలో ఒక స్పూను మెంతులను వేసి బాగా మరిగించి, వడకట్టి ఆ నీటిని తాగితే మంచిది. ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మెంతి గింజల్లో గ్లూకోమన్నన్ ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల చక్కెరను పేగు శోషించుకోవడం నెమ్మదిగా జరుగుతుంది. మెంతులు చర్మం, శ్లేష్మ పొరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
మెంతి గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి. నానబెట్టిన మెంతి వాటర్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
మెంతుల్లో ఉండే కరిగే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా మద్దతు ఇస్తుంది
మెంతి సౌందర్య పోషణలోనూ బాగా ఉపయోగడుతుంది. మెంతి గింజలు పీరియడ్స్ సమస్యలకు కూడా మంచి చిట్కా పనిచేస్తాయి. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పి, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి కూరను ఆకుకూరగా వాడుకోవచ్చు.
నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే. సరియైన సమాచారం, చికిత్స కోసం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం
Comments
Please login to add a commentAdd a comment