Fenugreek
-
షుగర్ వచ్చిందా? పరగడుపున మెంతి నీళ్లు ట్రై చేశారా?
మధుమేహం, లేదా షుగర్వ్యాధి వచ్చిందంటే నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతతాయి. ఒత్తిడి లేని జీవితం, జీవన శైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహార నిబంధనలు పాటిస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ అదుపులో ఉండేలా ఒక చిన్న చిట్కాను తెలుసుకుందాం.శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.మధుమేహాన్ని వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. అందుకే మధుమేహం లక్షణాలు, జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలి. 2030 నాటికి మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ఏడోఅతిపెద్ద కిల్లర్‌గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.శరీరంలో పాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆహారంలో ఉండే చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వ చేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ దీని పని. ఆహారం జీర్ణమైనప్పుడు అందులోని చక్కెర గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. ఈ గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా సమస్యే. అందుకే, ఆహార నిపుణులు సమతుల్య ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శరీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది చిన్న వయస్సులోనే మధుమేహం బారినపడుతున్నారు.కారణాలుసరైన వేళల్లో భోజనం, నిద్ర లేకపోవడం మధుమేహానికి దారి తీస్తుంది.వంశపారంపర్యంగా తల్లిదండ్రులు, ఇంకా ముందు తరం నుంచి కూడా టైప్-2 మధుమేహం వస్తోంది.వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మధుమేహం రావచ్చు.మధుమేహం మొత్తం మూడు రాకలు. టైప్-1, టైప్-2 ముఖ్యమైనవి. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని ‘గెస్టేషనల్’ అంటారు. మెంతుల వాటర్ ఒక స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసుకోవడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా ఇది ఉపయోగపడుతుంది.లేదంటే గ్లాసు నీటిలో ఒక స్పూను మెంతులను వేసి బాగా మరిగించి, వడకట్టి ఆ నీటిని తాగితే మంచిది. ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మెంతి గింజల్లో గ్లూకోమన్నన్ ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల చక్కెరను పేగు శోషించుకోవడం నెమ్మదిగా జరుగుతుంది. మెంతులు చర్మం, శ్లేష్మ పొరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.మెంతి గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి. నానబెట్టిన మెంతి వాటర్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.మెంతుల్లో ఉండే కరిగే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా మద్దతు ఇస్తుందిమెంతి సౌందర్య పోషణలోనూ బాగా ఉపయోగడుతుంది. మెంతి గింజలు పీరియడ్స్ సమస్యలకు కూడా మంచి చిట్కా పనిచేస్తాయి. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పి, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి కూరను ఆకుకూరగా వాడుకోవచ్చు. నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే. సరియైన సమాచారం, చికిత్స కోసం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం -
మెంతులు..ఇంతులు అంటూ తెగ తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
మన వంటింట్లో దొరికే మెంతులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాదు. అతివలకు మెంతుల వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు. మధుమేహం సహా అనేక అనారోగ్య సమస్యలకు అవి ఔషధంలా పనిచేస్తాయి. తినడానికి చిరు చేదుగా అనిపించినా మెంతులు వల్ల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. అందుకే పోపు గింజల్లో మెంతులును ప్రధానంగా చేర్చారు మన పెద్ద వాళ్లు. పౌడర్లు, క్యాప్సూల్స్ , నూనెలతో సహా వివిధ రూపాల్లో లభిస్తున్న ఈ మెంతులు పురుషులు,స్త్రీలలో ఇతర వైద్య పరిస్థితులకు కూడా సహాయపడతాయని నమ్ముతారు. మెంతులను వివిధ రూపాల్లో తీసుకోవడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి మెంతులలో దాగి ఉన్న ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..? ప్రయోజనాలు ⇒ మెంతులు (ట్రైగోనెల్లా ఫోనమ్-గ్రేకమ్) అనేది బఠానీ కుటుంబానికి (ఫాబేసి) చెందిన సుగంధ ద్రవ్యం. ⇒ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ⇒ జుట్టు పెరుగుదలకు మంచిది ⇒ బ్లడ్ కొలెస్ట్రాల్‌ను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకుంది. ⇒ జ్వరం, అలెర్జీల , గాయాల చికిత్సలో మెంతులు మన రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో బాగా పనిచేస్తాయి. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలంటారు నిపుణులు. మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది.అంటే ఒంట్లో కొవ్వు కరుగుతుంది. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపున ఆ నీళ్లను తాగాలి. ఇలా చేయడంవల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అదేవిధంగా విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు ఉపయోగపడుతాయి. మెంతి టీ ద్వారా బ్లడ్ లో షుగర్ అదుపులో ఉంటుంది. చిటపట శబ్దం వచ్చేదాకా మెంతులను వేయించి మెత్తగా పౌడర్లా చేసుకుని , రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మెంతులు-ఇంతులు మహిళలు సౌందర్య పోషణలో కూడా మెంతులకు విరివిగా వాడవచ్చు బాగా మెత్తగా దంచిన మెంతిపౌడర్లో కొద్దిగా తేనె కలిపిన మిశ్రమంతో ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఎండిన తరువాత నీటితో చక్కగా కడిగేసుకుంటే.. చర్మం భలే స్మూత్‌గా ఉంటుంది. మెంతులలో ఉండే లెసిథిన్ కనుబొమ్మలే ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. నాన పెట్టిన గుప్పెడు మెంతులను మెత్తని ముద్దగా నూరుకోవాలి. దీన్ని కనుబొమ్మలకు రాసుకుని 20-25 నిమిషాల తరువాత తడి గుడ్డతో చాలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడు- నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కండరాల నొప్పులకు మెంతులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.ఐరన్ లోపాన్ని కూడా ఈ మెంతులు తగ్గిస్తాయి. కఫం,దగ్గు, ఆస్తమా లాంటి సమస్యలకు మెంతు మంచి ఉపశమనం కలిగిస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ పాలిచ్చే తల్లులకు పాలు పడటం కోసం మెండి పౌడర్‌ను ఎక్కువగా వాడతారు. దీని వల్ల పిల్లలకు ఎటువంటి హాని జరగనప్పటికీ, మెంతి సప్లిమెంట్లను తీసుకునే ముందు వైర్భిణీలేదా పాలిచ్చే స్త్రీలు వైద్యులు సలహా మేరకు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మెంతి సప్లిమెంట్లు లేదా మందులకు దూరంగా ఉండాలంటున్నారు కొంతమంది నిపుణులు. ఎందుకంటే గర్భాశయ సంకోచాలు పెరిగి అవి శిశువుపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి, ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. డెలివరీకి కొద్దిసేపటికి ముందు మెంతులు తీసుకోవడం వల్ల శిశువుల మూత్రం, శరీరంనుండి అసాధారణమైన వాసన వస్తుంది. ఈ వాసన ప్రమాదకరం కానప్పటికీ, మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అని పిలిచే జన్యుపరమైన పరిస్థితి వస్తుందంటారు. మెంతులు శరీరంపై ఈస్ట్రోజెన్ లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లలో ఈస్ట్రోజెన్-ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందట. కనుక మెంతి సప్లిమెంట్లను ఉపయోగించాలనుకుంటే వైద్యులను సంప్రదించాలి. మరికొన్ని ⇒ అతిసారం ⇒ అజీర్ణం ⇒ కడుపు ఉబ్బరం ⇒ వికారం ⇒ తలనొప్పి ⇒ తలతిరగడం -
Health Tips: అతి వద్దు.. డయాబెటిస్‌ను అదుపులో ఉంచే ఆహారాలివే!
ఈ డిజిటల్ యుగంలో ఆధునిక జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వలు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వయసుతో తేడాతో లేకుండా చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే, ఈ చిన్న చిట్కాలు పాటిస్తూ, ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచే కొన్ని ఆహారాలు: ►మెంతులు, కలబంద, దాల్చినచెక్క, కాకరకాయ ►రోజూ ఒక 45 నిమిషాలు వేగంగా నడవండి. (ఏదైనా ఎక్సర్సైజ్) ►దేని గురించి అతిగా చింతించకండి. సంతోషంగా వుండండి. ►ఒకేసారి ఎక్కువమొత్తంలో ఆహారాన్ని తీసుకోవడానికి బదులు తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తీసుకోవడం చాలా మంచిది. ►ఏదీ అతి చెయ్యకండి.( ఫుడ్, ఎక్సర్సైజ్). ఏదైతే మీరు లైఫ్ లాంగ్ చేయగలరో అవే స్టార్ట్ చెయ్యండి ►రాత్రి తొందరగా డిన్నర్ పూర్తి చేయండి. ►7 నుంచి 8 గ్లాసుల నీళ్ళు తాగండి. ►పళ్ళు, కూరలు ఎక్కువగా తినండి. ►ఎక్కువసేపు కూర్చుని/ పడుకొని (పగలు) ఉండకండి. ►10 గంటలకి టంచనుగా పడుకోండి. 8గంటలపాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ►మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ►ప్రకృతికి దగ్గరగా బతకడం అలవాటు చేసుకోవాలి. ►సూర్య నమస్కారాలు చేయడం, మంచి ఆలోచనలు, భావాలు కలిగి వుండటం చాలా మంచిది. ►వ్యక్తుల గురించి కాకుండా, ఉన్నత భావాల గురించి మాట్లాడుకోవడం, యోగ చెయ్యడం ►నిరాశావాదులకి దూరంగా వుండటం వంటి వాటి వల్ల మధుమేహాన్ని రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ అదుపులో ఉంచుకోవచ్చు. చదవండి: పైల్స్‌తో బాధపడుతున్నారా? వీటిని తినడం తగ్గించండి! ఇవి తింటే మేలు! Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్మెంట్ ఉందా? -
చుండ్రు సమస్యకు 2 చిట్కాలు! సింపుల్‌గా వదిలించేద్దాం
► అరకప్పు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం నీళ్లు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. ► దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. ► అరగంట తరువాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి. ► అరకప్పు నానిన మెంతులను పేస్టులా రుబ్బుకోవాలి. ► దానికి, పావు కప్పు అలోవెరా పేస్టు కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. చదవండి👉🏻 పొడి చర్మానికి తక్షణ నిగారింపు కోసం ఇలా చేయండి.. ► అరగంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి . ► ఈ రెండు ప్యాక్‌లలో ఏదైనా ఒకదానిని వారానికి రెండుసార్లు తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గుముఖం పడుతుంది. దురద కూడా తగ్గుతుంది. చదవండి👉🏼 పైనాపిల్ – బత్తాయి.. పోషకాల జ్యూస్! -
రసాయనాలు వాడకుండా ఇంట్లోనే షాంపు తయారు చేసుకోవచ్చు.. అదెలాగంటే..
కాలుష్యం, జీవనశైలిలో మార్పులు, సరిగా పట్టించుకోకపోవడం, రసాయన షాంపుల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతిని నిర్జీవంగా మారుతుంది. ఫలితంగా విపరీతంగా జుట్టు రాలడం, త్వరగా రంగు మారడంతోపాటు, వెంట్రుకలు చిట్లిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటిని అధిగమించేందుకు ఇంట్లోనే ఎంచక్కా ఎటువంటి రసాయనాలు వాడకుండా షాంపు తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. ► ఉసిరి పొడి, కుంకుడు కాయలు, శీకాకాయ, మెంతులను వందగ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటన్నింటిని బాగా ఎండబెట్టాలి. ► తడిలేకుండా ఎండిన తరువాత అన్నింటిని ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ► ఉదయం దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నని మంటమీద ఉడికించాలి. ► అరగంట తరువాత చల్లారనిచ్చి వడగట్టి సీసాలో నిల్వచేసుకోవాలి. తలస్నానం చేయాలనుకున్నప్పుడల్లా ఈ నీటిని షాంపుగా వాడుకోవాలి. ► ఈ షాంపు తలలో అధికంగా ఉన్న ఆయిల్, దుమ్ము దూళిని వదిలించి కుదుళ్లకు పోషణ అందిస్తుంది. ► ఈ షాంపుని క్రమం తప్పకుండా వాడితే జుట్టురాలడం తగ్గి, కొత్త జుట్టువస్తుంది. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు ►ఐదారు ఉల్లిపాయ తొక్కలు, వందగ్రాముల మెంతులు, యాభై గ్రాముల అలోవెరా జెల్, యాభై గ్రాముల టీ పొడి, విటమిన్ ఈ క్యాప్య్సూల్ ఒకటి, బేబి షాంపు యాభై గ్రాములు తీసుకోవాలి. ► ఉల్లిపాయ తొక్కలు, మెంతులు, టీ పొడిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి మరిగించాలి. అన్ని మరిగి, నీళ్లు రంగు మారాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ► చల్లారాక ఈ నీటిని సీసాలో వేసి విటమిన్ ఈ క్యాప్సూయల్, అలోవెరా జెల్, బేబి షాంపు వేసి బాగా షేక్ చేయాలి. ►పదిగంటలపాటు కదల్చకుండా పక్కన పెట్టేయాలి. తరువాత దీనిని షాంపులా వాడుకోవచ్చు. ► ఈ షాంపు జుట్టుకు పోషణ అందించడంతోపాటు, చుండ్రును దరిచేరనివ్వద్దు. ► ఉల్లిపాయ తొక్కలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, మందంగా పెరిగేలా చేస్తాయి. చదవండి: రంగుల కేళీ హోలీ రోజున ఈ స్వీట్ రుచి చూడాల్సిందే.. -
Diabetes: బ్లడ్ షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం మరొకటి అధిక బరువు. ఇటీవలి కాలంలో ఇవి చాలా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. మారిన జీవన శైలి, ఆహార నియమాలు, జంక్ఫుడ్స్, ఇతర అనారోగ్యకరమైన జీవన పద్ధతులు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయి. అయితే మన కిచెన్‌లోని అతి సాధారణ మసాలా దినుసులు, మూలికలతో షుగర్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపులోకి తేవచ్చు. ఆ వివరాలేంటి ఒకసారి చూద్దాం. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటిగా మారిపోయింది. దీని వలన తీవ్రమైన సమస్యలు రావడంతో పాటు, ఒక్కోసారి శారీరక వైకల్యంతో బాడీపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా మనిషి సగటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. అయితే షుగర్ వ్యాధి బారిన పడినంత మాత్రాన బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు. తమ రోజు వారీ ఆహారం, తేలికపాటి వ్యాయామాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడు తూనే, శరీరంలో షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు చిట్కాలు పాటిస్తుండాలి. ముఖ్యంగా వంట ఇంట్లో మనకు అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాలు, ఇతర ఆయుర్వేద విలువలు కలిగిన మూలికలతో షుగర్ వ్యాధికి చెక్ చెప్పవచ్చు. అలాంటి వాటిలో దాల్చిన చెక్క, పసుపు, మెంతులు, జీలకర్ర, సోంపు ప్రధానంగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్‌కి రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు నిత్యం మనం వాడే వస్తువులు దోహదం చేస్తాయి. ముఖ్యంగా పసుపును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వ్యాధులనుంచి తప్పించే సహజసిద్ధమైన యాంటిబయోటిక్‌గా పనిచేసే పసుపును ప్రతీ ఒక్కరు తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. మన బాడీలోకి ప్రవేశించే ఏ రకమైన వైరస్ లేదా బాక్టీరియాతోనైనా మనకు తెలియకుండానే ఇది ఫైట్ చేసుంది. ఇక మధుమేహం విషయంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే కేవలం మాసాలా దినుసుగా మాత్రమే కాదు దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. దీన్ని మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడంతోపాటు, షుగర్ బాధితులు దాల్చిన చెక్క టీని తీసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క నీరు లేదా టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం.ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు వడకట్టి ఈ నీటిని తాగాలి. లేదా ఆ మెంతులతో పాటు తీసుకున్నా మంచిదే. మనం రోజు పోపు దినుసులా వాడే జీలకర్ర కూడా సుగర్ లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. సోంపులో ఉండే అనిథాల్ శరీరంలోని అనేక ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను నివారిస్తుంది. సోపు గింజల్లో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు మధుమేహ బాధితులకు మేలు చేస్తాయి. -
షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
-
టెన్షన్ ఆవిరి
వేసవిలో మనమందరం ఉడుకుతాం. అందుకే దేవుడు వేసవి సృష్టించాడు.ఉడికితే మెత్తపడతాం. మెత్తటి బలాన్ని పుంజుకుంటాం.శరీరమంతా శుభ్రమైపోతుంది. చెడు ఆవిరైపోతుంది.ఇడ్లీ జీర్ణించుకోవడం చాలా సులభం. వెంటనే బలాన్నిస్తాయి.ఈ పరీక్షల టైమ్‌లో టెన్షన్‌ని ఆవిరి చేసేస్తాయి. బ్రెడ్ ఇడ్లీ కావలసినవి బ్రెడ్ స్లైసులు – 4 ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; బేకింగ్ సోడా – చిటికెడు; నూనె – కొద్దిగా తయారీ ►బ్రెడ్ స్లైసుల అంచులు తీసేయాలి ►ఒక పాత్రలో బ్రెడ్‌ను పొడిపొడిగా చేసి వేయాలి ►ఒక కప్పు ఇడ్లీ రవ్వ జత చేయాలి ►ఉప్పు, పెరుగు జత చేయాలి ►తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టి అరగంటసేపు పక్కన ఉంచాలి ►బేకింగ్ పౌడర్ జత చేసి కలపాలి ►ఇడ్లీరేకులకు కొద్దిగా నూనె పూయాలి ►ఒక్కో గుంటలో గరిటెడు పిండి వేయాలి ►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి ►పది నిమిషాల తరవాత దింపేయాలి ►చల్లారాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటాయి. అటుకుల ఇడ్లీ కావలసినవి: ఉప్పుడు బియ్యం – ఒక కప్పు; అటుకులు – ఒక కప్పు; మినప్పప్పు – 3 టేబుల్ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; నీళ్లు – నానబెట్టడానికి తగినన్ని; పంచదార – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఇడ్లీ రేకులకు రాయడానికి తగినంత తయారీ ► ఒక పాత్రలో ఉప్పుడు బియ్యం, మినప్పప్పు, మెంతులు వేసి, తగినన్ని నీళ్లు జతచేసి బాగా కడిగి, నీళ్లు ఒంపేయాలి ►అటుకులకు తగినన్ని నీళ్లు జత చేసి బాగా కడిగి, నీళ్లు ఒంపేయాలి ►ఒక పాత్రలో వీటిని అన్నిటినీ వేసి తగినన్ని నీళ్లలో సుమారు ఆరు గంటలపాటు నానబెట్టాలి ►నీళ్లు ఒంపేసి, నానబెట్టిన పదార్థాలను గ్రైండర్లో వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా ఇడ్లీ పిండిలా రుబ్బుకుని, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►తగినంత ఉప్పు, పంచదార జత చేసి బాగా కలిపి, మూత పెట్టి సుమారు తొమ్మిది గంటలపాటు ఉంచాలి ►ఇడ్లీ రేకులను శుభ్రంగా కడిగి, నెయ్యి లేదా నూనె పూసి, నానబెట్టిన పిండిని ఆ గుంటలో వేసి, ఇడ్లీ స్టాండులో ఉంచి స్టౌ మీద ఉంచాలి ►సుమారు పావు గంట తరవాత దింపేయాలి ►కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. సాబుదానా ఇడ్లీ కావలసినవి: సగ్గుబియ్యం – అర కప్పు; ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – తగినంత; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూను; నూనె – కొద్దిగా తయారీ ►సగ్గు బియ్యం, ఇడ్లీ రవ్వలను విడివిడిగా కడగాలి ►ఒక పాత్రలో పెరుగు వేయాలి ►కడిగి ఉంచుకున్న సగ్గుబియ్యం, ఇడ్లీరవ్వల మిశ్రమం వేసి బాగా కలపాలి ►తగినన్ని నీళ్లు జత చేసి రాత్రంతా నానబెట్టాలి ►మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి (మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి) ►కొద్దిగా నీళ్లు, ఉప్పు జత చేసి, మరోమారు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఇడ్లీ రేకులలో వేసుకునే ముందు కొద్దిగా బేకింగ్ సోడా జత చేయాలి ►ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూయాలి ►ప్రతి గుంటలోను కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి, ఆపైన ఇడ్లీ పిండి వేయాలి ►ఇడ్లీ స్టాండులో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, స్టౌ మీద ఉంచాలి ►పది నిమిషాల తరవాత దింపేయాలి ►కొద్దిగా చల్లారాక ఇడ్లీలను ప్లేట్లలోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారుతో అందిస్తే రుచిగా ఉంటాయి. రవ్వ ఇడ్లీ కావలసినవి: నూనె – 3 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చిసెనగ పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; క్యారట్ తురుము – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; బొంబాయి రవ్వ – ఒక కప్పు; పెరుగు – ముప్పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూను తయారీ ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి ►మంట బాగా తగ్గించి, రవ్వ వేసి దోరగా వేయించి దింపేయాలి ►బాగా చల్లారాక పెరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు జత చేసి కలియబెట్టాలి ►తగినన్ని నీళ్లు జతచేయాలి ►ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూసి, గుంటలలో జీడిపప్పు పలుకులు వేయాలి ►ఒక్కో గుంటలో గరిటెడు పిండి వేయాలి ►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, స్టౌ మీద ఉంచాలి ►పది నిమిషాల తరవాత దింపేయాలి ►చల్లారాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటాయి. సేమ్యా ఇడ్లీ కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; నూనె – ఒక టీ స్పూను; సేమ్యా – అర కప్పు; పెరుగు – ఒక కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని; బేకింగ్ సోడా – అర టీ స్పూను పోపు కోసం: నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – కొద్దిగా; నూనె – తగినంత; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూను తయారీ ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ►అదే బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక సేమ్యా వేసి దోరగా వేయించి తీసేయాలి ►ఒక పాత్రలో... వేయించిన రవ్వ, వేయించిన సేమ్యా, పెరుగు వేసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఇంగువ వేసి వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, కరివేపాకు వేసి కలపాలి ►పసుపు జత చేసి బాగా కలిపి దింపేయాలి ►నానబెట్టుకున్న సేమ్యా మిశ్రమానికి జత చేయాలి ►కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి కలియబెట్టాలి ►అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జతచేసి, మూత పెట్టి అరగంటసేపు వదిలేయాలి ►ఇడ్లీలు వేసే ముందు బేకింగ్ సోడా జత చేయాలి ►ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూసి, గుంటలలో జీడిపప్పు పలుకులు వేసి, ఆపైన గరిటెడు పిండి వేయాలి ►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, స్టౌ మీద ఉంచాలి ►పది నిమిషాల తరవాత దింపేయాలి ►చల్లారాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటాయి. కాంచీపురం ఇడ్లీ కావలసినవి: బియ్యం – అర కప్పు; ఉప్పుడు బియ్యం – అర కప్పు; మినప్పప్పు – అర కప్పు; మెంతులు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; అల్లం తురుము – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; అరటి ఆకులు – తగినన్ని తయారీ ► బియ్యం, ఉప్పుడు బియ్యం, మినప్పప్పులను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రాత్రంతా నానబెట్టాలి ►ఇందులోనే మెంతులు కూడా వేయాలి ►మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, బియ్యం మిశ్రమాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక జీలకర్ర, మిరియాల పొడి, ఇంగువ, జీడిపప్పు పలుకులు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, తీసేసి, ఇడ్లీ పిండిలో వేసి కలపాలి ►అల్లం తురుము, ఉప్పు జత చేసి కలపాలి ►అరటి ఆకులను పెనం మీద గోరు వెచ్చన చేసి పక్కన ఉంచాలి ►చిన్న చిన్న కప్పులు తీసుకుని వాటికి కొద్దిగా నూనె పూసి, ఆపైన అరటి ఆకు ముక్కలను (కప్పు ఆకారంలో) మడిచి, కప్పులో ఉంచాలి ►అందులో తగినంత పిండి వేయాలి ►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ పిండి వేసిన కప్పులను అందులో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి ►పది నిమిషాల తరవాత దింపేయాలి ►వేడి తగ్గాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకోవాలి ►కొబ్బరి చట్నీతో అందించాలి. -
మెంతికూర – శనగపప్పు
తయారి సమయం: 30 నిమిషాలు కావలసినవి మెంతి కూర – కట్ట (కడిగి శుభ్రపరచాలి), పచ్చి శనగపప్పు – కప్పు, ధనియాల పొడి – టీ స్పూన్, ఉల్లిపాయ – 1, కారం – అర టీ స్పూన్ నీళ్లు – 2 కప్పులు, పసుపు – పావు టీ స్పూన్, నూనె – టేబుల్ స్పూన్ జీలకర్ర – అర టీ స్పూన్ వెల్లుల్లి రేకలు – 4 ఇంగువ – చిటికెడు, పచ్చిమిర్చి–1 టొమాటోలు–2 (చిన్నగా కట్ చేసుకోవాలి) ఉప్పు – రుచికి సరిపడా తయారి ♦ ముందుగా పచ్చి శనగపప్పు, నీళ్లు, ఉప్పు, ధనియాల పొడి ప్రెజర్ కుకర్‌లో వేసి, మరీ మెత్తగా ఉడకబెట్టకుండా ఒక్క విజిల్ వచ్చేవరకు ఉంచి తీయాలి. ♦ పాత్రలో నూనె వేడయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడించాక ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించి ఇంగువ, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి. ♦ టొమాటోలు, పచ్చిమిర్చి వేసి అయిదు నిమిషాల పాటు వేయించాక, కారం వేయాలి. ♦ మెంతి కూర, ఉడకబెట్టిన పప్పు వేసి కలియబెట్టాలి. మూత పెట్టి 15 నిమిషాల వరకు వేయించాలి. ♦ మెంతి మిశ్రమం కాస్త దగ్గరగా అయిన తరవాత దింపేయాలి. ♦ దీనిని వేడివేడిగా చపాతీల్లోకి అందిస్తే రుచిగా ఉంటుంది.