ఈ డిజిటల్ యుగంలో ఆధునిక జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వలు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వయసుతో తేడాతో లేకుండా చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే, ఈ చిన్న చిట్కాలు పాటిస్తూ, ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
మధుమేహాన్ని అదుపులో ఉంచే కొన్ని ఆహారాలు:
►మెంతులు, కలబంద, దాల్చినచెక్క, కాకరకాయ
►రోజూ ఒక 45 నిమిషాలు వేగంగా నడవండి. (ఏదైనా ఎక్సర్సైజ్)
►దేని గురించి అతిగా చింతించకండి. సంతోషంగా వుండండి.
►ఒకేసారి ఎక్కువమొత్తంలో ఆహారాన్ని తీసుకోవడానికి బదులు తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తీసుకోవడం చాలా మంచిది.
►ఏదీ అతి చెయ్యకండి.( ఫుడ్, ఎక్సర్సైజ్). ఏదైతే మీరు లైఫ్ లాంగ్ చేయగలరో అవే స్టార్ట్ చెయ్యండి
►రాత్రి తొందరగా డిన్నర్ పూర్తి చేయండి.
►7 నుంచి 8 గ్లాసుల నీళ్ళు తాగండి.
►పళ్ళు, కూరలు ఎక్కువగా తినండి.
►ఎక్కువసేపు కూర్చుని/ పడుకొని (పగలు) ఉండకండి.
►10 గంటలకి టంచనుగా పడుకోండి. 8గంటలపాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి.
►మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
►ప్రకృతికి దగ్గరగా బతకడం అలవాటు చేసుకోవాలి.
►సూర్య నమస్కారాలు చేయడం, మంచి ఆలోచనలు, భావాలు కలిగి వుండటం చాలా మంచిది.
►వ్యక్తుల గురించి కాకుండా, ఉన్నత భావాల గురించి మాట్లాడుకోవడం, యోగ చెయ్యడం
►నిరాశావాదులకి దూరంగా వుండటం వంటి వాటి వల్ల మధుమేహాన్ని రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ అదుపులో ఉంచుకోవచ్చు.
చదవండి: పైల్స్‌తో బాధపడుతున్నారా? వీటిని తినడం తగ్గించండి! ఇవి తింటే మేలు!
Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్‌మెంట్ ఉందా?
Comments
Please login to add a commentAdd a comment