మెంతికూర – శనగపప్పు | Fenugreek peanut dal recipe | Sakshi
Sakshi News home page

మెంతికూర – శనగపప్పు

Published Wed, Aug 30 2017 12:49 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

మెంతికూర – శనగపప్పు

మెంతికూర – శనగపప్పు

తయారి సమయం: 30 నిమిషాలు
కావలసినవి
మెంతి కూర – కట్ట (కడిగి శుభ్రపరచాలి), పచ్చి శనగపప్పు – కప్పు,
ధనియాల పొడి – టీ స్పూన్,
ఉల్లిపాయ – 1,
కారం – అర టీ స్పూన్‌
నీళ్లు – 2 కప్పులు, పసుపు – పావు టీ స్పూన్, నూనె – టేబుల్‌ స్పూన్‌
జీలకర్ర – అర టీ స్పూన్‌
వెల్లుల్లి రేకలు – 4
ఇంగువ – చిటికెడు, పచ్చిమిర్చి–1 టొమాటోలు–2 (చిన్నగా కట్‌ చేసుకోవాలి) ఉప్పు – రుచికి సరిపడా
తయారి
♦ ముందుగా పచ్చి శనగపప్పు, నీళ్లు, ఉప్పు, ధనియాల పొడి ప్రెజర్‌ కుకర్‌లో వేసి, మరీ మెత్తగా ఉడకబెట్టకుండా ఒక్క విజిల్‌ వచ్చేవరకు ఉంచి తీయాలి.
♦ పాత్రలో నూనె వేడయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడించాక ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించి ఇంగువ, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి.
♦ టొమాటోలు, పచ్చిమిర్చి వేసి అయిదు నిమిషాల పాటు వేయించాక, కారం వేయాలి.
♦  మెంతి కూర, ఉడకబెట్టిన పప్పు వేసి కలియబెట్టాలి. మూత పెట్టి 15 నిమిషాల వరకు వేయించాలి.
♦ మెంతి మిశ్రమం కాస్త దగ్గరగా అయిన తరవాత దింపేయాలి.
♦ దీనిని వేడివేడిగా చపాతీల్లోకి అందిస్తే రుచిగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement