సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు ప్రవేశించింది. సిబ్బంది మోటార్లతో వరద నీటిని తోడుతున్నారు. సీఎం నివాసం వైపు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.
ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇల్లు నీటమునిగింది.
కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో ఆయన ఇంట్లోకి వరద నీరు పోటెత్తింది. మరోవైపు.. ప్రకాశం బ్యారేజ్‌కు అనూహ్యంగా గంట గంటకు వరద నీరు ప్రవాహం పెరుగుతోంది.
కరకట్టపై అక్రమంగా కట్టిన చంద్రబాబు ఇల్లు మునక
వైయస్ జగన్ గారి హయాంలో ప్రకాశం బ్యారేజ్‌లోని ఒక గేటుకి బోటు అడ్డంపడితే.. మా ఇంటిని ముంచేందుకు కుట్ర అంటూ అప్పట్లో చంద్రబాబు, నారా లోకేష్ గగ్గోలు
ఇప్పుడు చంద్రబాబు ఇంటి ప్రాంగణంలోకి చేరిన వరద నీరు.. మరి ఇప్పుడు ఎవరు కుట్ర… https://t.co/qruHOMsQbk pic.twitter.com/tkH6rRhfav— YSR Congress Party (@YSRCParty) September 1, 2024
చంద్రబాబు ఇంటికి వరద ముప్పు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి పెరిగింది. 9.17 లక్షల క్యూసెక్కులకు చేరింది.
దీంతో రాత్రికి వరద ఉదృతం కానుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఉందని, ఈ రాత్రికి ఇంట్లో బస చేస్తే ప్రమాదం ఉందని భావించిన అధికారులు..ప్రత్యామ్నాయ బస ఏర్పాట్లు చేస్తే మంచిదని సూచించారు. ఈరోజు రాత్రికి కలెక్టరేట్‌లో ఉంటే బావుంటుందని సలహా ఇస్తున్నారు.
రాష్ట్ర చరిత్రలో రెండోసారి
రాష్ట్ర చరిత్రలో 9.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రెండవ అతి పెద్ద వరదగా నమోదైంది. ఆ రికార్డును కొద్దిగంటల్లో అధిగమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 24 గంటల్లో 6 లక్షలు క్యూసెక్కులు వరద పెరిగింది. 2009లో అత్యధికంగా 11 లక్షలు క్యూసెక్కుల వరద నమోదు కాగా..గంట గంటకు పెరుగుతున్న వరదతో అధికారులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది
Comments
Please login to add a commentAdd a comment