ఇసుక బస్తాలు వేసి వరద చేరకుండా అధికారులు చేసిన విశ్వప్రయత్నం విఫలం
దీంతో వరద బాధితుడిగా మారిన సీఎం
ఉండవల్లి నివాసంలో ఉండటం ప్రమాదమని సీఎంకు అధికార వర్గాల సూచన
విజయవాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చంద్రబాబుకు బస
తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కలెక్టర్ కార్యాలయం నుంచి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తానంటూ బీరాలు
సాక్షి, అమరావతి: భారీ వర్షాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ సౌధాన్ని వరద ముంచెత్తింది. దీంతో చంద్రబాబు కూడా వరద బాధితుడిగా మారారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) గత నెల 28నే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షించాల్సిన చంద్రబాబు తన కర్తవ్యాన్ని విస్మరించారు. ఫలితంగా తాను విజనరీనని చెప్పుకునే సీఎం చంద్రబాబు స్వయంగా వరద కోరల్లో చిక్కుకున్నారని అధికారవర్గాలే చెబుతున్నాయి.
ఆదివారం రాత్రికి కృష్ణా వరద ఉధృతి మరింత పెరుగుతుందని.. రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు వివరించారు. దీంతో ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు. విజయవాడ నగరానికి, లక్షలాది మంది ప్రజలకు వరద ముప్పును తప్పించడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే విజయవాడలో ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచే సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కర్తవ్యం మరిచి.. విద్యుక్త ధర్మం విస్మరించి..
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కి గరిష్ట వరద ప్రవాహం వస్తుందని తెలిసినా చంద్రబాబు ముందు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేయలేదు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉన్న అక్రమ సౌధంసహా 35 బంగ్లాలను వరద చుట్టుముట్టింది. ఇందులో చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ గెస్ట్ హౌస్‌గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది.
సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఇసుక బస్తాలు వేసి వరద చేరకుండా జలవనరుల అధికారులు విశ్వప్రయత్నం చేసినా ఫలించలేదు. వరద జలాలు చుట్టుముట్టడంతో ఆ సౌధంలో నివాసం ఉండటం ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం అర్ధరాత్రికి కృష్ణాలో ప్రవాహం 10.50 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని, అప్పుడు పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని తేలి్చచెప్పారు. దాంతో విధి లేని పరిస్థితుల్లో ఆదివారం రాత్రి విజయవాడలోని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సీఎం చంద్రబాబు తన మకాం మార్చారు.
నాడు ముంచేశారని.. నేడు తానే మునిగి..
కృష్ణా నదికి 2019లో ఆగస్టు 14 నుంచి 17 వరకూ భారీ వరదలు వచ్చాయి. అప్పుడు కూడా చంద్రబాబు నివాసంతోపాటూ 35 అక్రమ బంగ్లాలు నీట మునిగాయి. 2020, 2021, 2022లోనూ ఇదే జరిగింది. కానీ.. ఇప్పుడు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. ఐఎండీ హెచ్చరికలను పట్టించుకోలేదు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఫలితంగా తానే వరద బాధితుడిగా చంద్రబాబు మారారు. అప్పట్లో తన నివాసాన్ని ముంచడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడెందుకు ముంపు ముప్పును తప్పించుకోలేకపోయారని అధికారవర్గాలే ప్రశి్నస్తున్నాయి.
చరిత్రలో మూడో అతి పెద్ద ప్రవాహం..
కృష్ణా నదిపై సర్ ఆర్ధర్ కాటన్ తొలుత ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టకు 1903, అక్టోబర్ 7న గరిష్ఠంగా 11.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచి్చంది. ఆ తర్వాత 2009, అక్టోబర్ 5న ప్రకాశం బ్యారేజ్‌లోకి 11,10,404 క్యూసెక్కుల వరద ప్రవాహం వచి్చంది. ఆదివారం రాత్రికి ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరే వరద 10.50 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే.. కృష్ణా నది చరిత్రలో ఇప్పుడొచ్చిన ప్రవాహం మూడో గరిష్ఠ వరద ప్రవాహంగా రికార్డుల్లోకి ఎక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment