శ్రీశైలం డ్యాం నీటిమట్టం 816.60 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయ నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 816.60 అడుగులకు చేరుకుంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల, రోజా, హంద్రీల నుంచి 44,779 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుతుంది. తెలంగాణ ప్రాంతంలోని భూగర్భజలవిద్యుత్‌కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతూనే ఉంది. శనివారం ఒకజనరేటర్ 150 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 38.4044 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.