కర్నూలు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. మంగళవారం రాత్రి సెల్ప్ క్యాచ్‌మెంట్ ఏరియాలో కురిసిన స్వల్ప వర్షం కారణంగా 676 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది. దీంతో 785 అడుగులుగా ఉన్న నీటిమట్టం 785.20 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాల్లో 16.60 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు 41.26 డిగ్రీలుగా ఉండడంతో జలాశయం నుంచి 76 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్ సిబ్బంది తెలిపారు.