శ్రీశైల జలశయానికి 25 టీఎంసీల నీటి చేరిక
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలానికి వరద ఉధతి ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు 25.0078 టీఎంసీల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది. 24 గంటల్లోనే 14.70 అడుగులు నీటిమట్టం పెరిగింది. జూరాల ప్రాజెక్టు నుంచి మధ్యాహ్నం 3గంటల సమయానికి 2.12 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన అనంతరం దిగువ నాగార్జునసాగర్‌కు 5,106 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, హంద్రీనీవా సుజలస్రవంతికి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 81.0918 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 850.50 అడుగులకు చేరుకుంది.