waterlevel
-
4 రోజుల్లో 95 టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు స్థానికంగా కురుస్తున్న వర్షాలు తోడవడంతో గోదావరి ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండగా, ప్రాణహిత నదిలో వరద అంతకంతకీ పెరుగుతోంది. గోదావరి, ప్రాణహిత కలిసిన అనంతరం దిగువన మేడిగడ్డ వద్ద మంగళవారం 3.55 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికం. రెండ్రోజుల కిందట వరకు అక్కడ 2.40 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగినా, అది ఒక్కసారిగా లక్ష క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు రోజుల వ్యవధిలోనే మేడిగడ్డ బ్యారేజీని దాటుతూ 95 టీఎంసీల గోదావరి నీరు దిగువకు వెళ్లింది. సోమవారం ఒక్క రోజే 20 టీఎంసీలు దిగువకు వెళ్లగా, మంగళవారం మరో 30 టీఎంసీలు మేడిగడ్డ బ్యారేజీని దాటి వెళ్లిపోయింది. భారీ వరద నేపథ్యంలో బ్యారేజీలో 85 గేట్లలో 44 గేట్ల (నాలుగు బ్లాక్‌లు) నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేశారు. కాంక్రీట్ పనుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. బేసిన్‌లోని ఎల్లంపల్లికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 13,111 క్యూసెక్కుల నీరు వస్తుం డటంతో అక్కడ నిల్వలు 20 టీఎంసీలకుగాను 7.89 టీఎంసీలకు చేరుకున్నాయి. ఈ సీజన్లో ఎల్లంపల్లిలోకి 4.13 టీఎంసీల కొత్తనీరు రాగా, మరో 12.29 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండనుంది. ఇక ఎస్సారెస్పీలోకి ప్రవాహాలు క్రమంగా తగ్గుతున్నాయి. రెండ్రోజుల కిందటి వరకు 10వేల క్యూసెక్కులకు పైగా వరద రాగా ప్రస్తుతం అది 2,401 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ 90.31 టీఎంసీలకు గానూ 12.12 టీఎంసీలకు చేరింది. కడెంలోకి 5,730 క్యూసెక్కులు వస్తుండగా, నిల్వ 7.60 టీఎంసీలకు 6.92 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండటంతో 6,085 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూరులోకి 461 క్యూసెక్కులు వస్తుండగా, నిజాంసాగర్‌లోకి చుక్క నీరు రావడం లేదు. ఆల్మట్టికి పది రోజుల్లో 30 టీఎంసీలు.. కర్ణాటకలో ఉధృతంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా నీరు వస్తోంది. గడిచిన పది రోజులుగా ప్రాజెక్టులోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటంతో ఏకంగా 30 టీఎంసీలకుపైగా కొత్త నీరు వచ్చి చేరింది. మంగళవారం సైతం ప్రాజెక్టులోకి ఏకంగా 52,897 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు నీటి మట్టం 57.73 టీఎంసీలకు చేరింది. 71.99 టీఎంసీల మేర నీటిలోటు కనబడుతోంది.తుంగభద్రలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 38,052 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు నిల్వలు 100 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 46.16 టీఎంసీలకు చేరింది. ఇక నారాయణపూర్‌కు ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ 37 టీఎంసీలకు ప్రస్తు తం 23.81 టీఎంసీల మేర నిల్వలతో ఆశాజనకంగా ఉన్నాయి. రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 5.73, నాగార్జునసాగర్ లో 312 టీఎంసీలకు గానూ 133.37 టీఎం సీలు, శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 29.06 టీఎంసీల నిల్వలున్నాయి. -
శ్రీశైలంలో తగ్గుతున్న నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం క్రమేపీ తగ్గుతోంది. వస్తున్న ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడం, దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న నీటి పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 48వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా, జలాశయం నుంచి 56,268 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదన చేస్తూ 45,043 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 9,200 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 202.5056 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.60 అడుగులకు చేరుకుంది. -
జలకళ
– నిండుకుండలా శ్రీశైలం డ్యాం – 12 రోజుల్లో 52 టీయంసీల నీరు చేరిక – 882 అడుగులకు చేరిన నీటి మట్టం – 28న గేట్లు ఎత్తేందుకు యత్నాలు కర్నూలు సిటీ: కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యాం గరిష్ట నీటిమట్టానికి చేరువగా ఉంది. ఈ నెల 15వ తేదీన 870.20 అడుగులు, 142.71 టీయంసీల నీరు ఉండగా సోమవారం రాత్రి నాటికి 882 అడుగులు, 194 టీయంసీలకు చేరుకుంది. భారీ వర్షాలతో 12 రోజుల్లోనే 52 టీఎంసీల నీరు చేరింది. ఈ నెల 28వ తేదీన రేడియల్ క్రస్ట్ గేట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేసేందుకు డ్యాం ఇంజినీర్లు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి శ్రీశైలంలో డ్యాం ఎస్ఈ మల్లికార్జునరెడ్డి, ఈఈలు, డీఈఈ, ఏఈఈలతో కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ నారాయణరెడ్డి సమావేశమై చర్చించారు. పూర్థి సామర్థ్యానికి చేరువలో.. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. పూర్తిస్థాయి సామర్థ్యం 305 టీయంసీలు. డ్యాంలోకి పూడిక చేరడంతో సామర్థ్యం 215 టీఎంసీలకు తగ్గిపోయింది. గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో 17.20 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో సుమారు 170 టీయంసీల నీరు డ్యాంలోకి వచ్చింది. ఇందులో 50 టీఎంసీలు పైగా దిగువకు వదిలారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో ఇలా కొనసాగితే 12 గంటలోన్లే డ్యాం నిండుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు 77 వేల క్యుసెక్కుల నీటిని వదులుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకు 1.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. రెండు, మూడు రోజుల క్రితం మహారాష్ట్రలోని మహబలేశ్వరంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్‌ఫ్లోకు మరింత వరద నీరు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నాం – మల్లికార్జునరెడ్డి, శ్రీశైలం డ్యాం ఎస్ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. డ్యాంలో 195 టీయంసీల నీరు చేరుకున్నాక గేట్లు ఎత్తేందుకు సిద్ధం అవుతున్నాం. ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు హాజరు అయ్యే అవకాశం ఉంది. సీఈతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటాం. -
శ్రీశైలం డ్యాం నీటి మట్టం 874.10 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 874.10 అడుగులకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 2.7 టీఎంసీల నీరు విడుదల కావడంతో నీటిమట్టం 6 పాయింట్లకు పడిపోయింది. 162.0554 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం గురువారం సాయంత్రానికి 159.3828 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ పరీవాహకప్రాంతమైన జూరాల నుంచి 16వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు సుమారు 40వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. రెండు పవర్‌హౌస్‌లలో డిమాండ్‌ను బట్టి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. సగటున విద్యుదుత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 25వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 14,200 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
శ్రీశైల జలశయానికి 25 టీఎంసీల నీటి చేరిక
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలానికి వరద ఉధతి ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు 25.0078 టీఎంసీల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది. 24 గంటల్లోనే 14.70 అడుగులు నీటిమట్టం పెరిగింది. జూరాల ప్రాజెక్టు నుంచి మధ్యాహ్నం 3గంటల సమయానికి 2.12 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన అనంతరం దిగువ నాగార్జునసాగర్‌కు 5,106 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, హంద్రీనీవా సుజలస్రవంతికి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 81.0918 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 850.50 అడుగులకు చేరుకుంది.