శ్రీశైలం జలాశయంలోకి 1.5 టీఎంసీల నీరు చేరిక
Published Mon, Sep 19 2016 11:52 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు: కష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం సాయంత్రం వరకు జలాశయంలోకి 1.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 159.0010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రోజా నుంచి వచ్చే వరద జలాలు నిలిచిపోగా, జూరాల నుంచి 16వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదలవుతుంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం 874 అడుగులకు చేరుకుంది.
Advertisement
Advertisement