నాగార్జునసాగర్ జలాశయం మంగళవారం సాయంత్రానికి కనిష్ట నీటిమట్టానికన్నా దిగువకు వెళ్లింది. సాగర్ జలాశయం కనిష్ట నీటిమట్టం 510 అడుగులు.
నాగార్జునసాగర్(నల్గొండ): నాగార్జునసాగర్ జలాశయం మంగళవారం సాయంత్రానికి కనిష్ట నీటిమట్టానికన్నా దిగువకు వెళ్లింది. సాగర్ జలాశయం కనిష్ట నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 509.80 అడుగులకు వెళ్లింది. దీంతో హైదరాబాద్‌కు తాగు నీరందించడానికి ఏఎమ్మార్పీలో భాగమైన పుట్టంగండి వద్ద ఏర్పాటు చేసిన మోటార్లలో ఒకదానికి నీరందక నిలిపివేశారు.
కేవలం ఒక మోటరు ద్వారానే నీటిని పంప్ చేస్తున్నారు. నేడోరేపో ఈ మోటారును కూడా నిలిపివేసే అవకాశం ఉంది. నిన్నటి వరకు శ్రీశైలం-సాగర్ జలాశయాల మధ్య ఉన్న కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన చిన్నపాటి జల్లులకు సాగిన వాగులు, వంపుల ద్వారా వచ్చి చేరిన నీటితో వారం రోజులు నెట్టుకువచ్చారు. ఇక వరదనీరు పూర్తిగా తగ్గడంతో సాగర్ జలాశయంలో నీరు తగ్గుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 802.70 అడుగులుంది. ఇది 30.3577 టీఎంసీలతో సమానం.