
సాగర్ డ్యాంకు గులాబీ రంగు
అభ్యంతరం తెలిపిన ఏపీ వాసులు
నాగార్జునసాగర్: రెండు రాష్ట్రాల మధ్య గులాబీ చిచ్చు రగిలింది. ఆంధ్రా–తెలం గాణ రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులతో ఆధునికీకరణలో భాగంగా రంగులు వేస్తున్నారు. డ్యాంపై రోడ్డుకు ఇరువైపులా గోడలకు గులాబీ రంగు వేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ రంగు గులాబీ కావడంతో డ్యాం అవతల వైపునఉన్న ఆంధ్రా వాసులు శుక్రవారం డ్యాం మీదకు వచ్చి రంగులు వేసిన గోడలను పరిశీలించారు.
సాగర్‌కు గులాబీ రంగు వేయడం ఏమిటని నిలదీ శారు. పాత రంగునే వేయాలని తెలంగాణ ఇంజనీర్లతో గొడవకు దిగారు. ఈ విష యమై సాగర్ డ్యాం సీఈ సునీల్‌ను వివ రణ కోరగా.. ఇది చర్చనీయాంశమే కాదని, రంగు నాణ్యమైనదా కాదా అని చూడాలి తప్ప.. ప్రాజెక్టుకు వేసే రంగు ఏదైతే ఏముందన్నారు. మొదట తెల్లరంగు, తర్వాత ఈ రంగు వేశామని.. పైన కింద బార్డర్ డార్క్ బ్లూ వస్తుందని తెలిపారు.