
కొండపోచమ్మ సాగర్ పనులను అడ్డుకున్న స్థానికులు (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా, మామిడ్యాలలో కొండపోచమ్మ సాగర్ నిర్మాణంకోసం చేపట్టిన భూ సేకరణకు సంబంధించిన తుది డిక్లరేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గ్రామ సభ నిర్వహించి, బాధిత ప్రజల అభ్యంతరాలను తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆ తరువాతనే పరిహారం చెల్లింపు, భూ స్వాధీనం తదితర ప్రక్రియను ప్రారంభించాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం తీర్పునిచ్చారు. కొండపోచమ్మ సాగర్ భూ సేకరణకు సంబంధించి అధికారులు జారీచేసిన డిక్లరేషన్‌ను సవాలు చేస్తూ ప్రవీణ్‌కుమార్, మరో 30 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు. గ్రామ సభ నిర్వహించకుండానే అధికారులు ముందుకెళుతున్నారని, తమ అభ్యంతరాలను కూడా పట్టించుకోవడం లేదని పిటిషనర్లు తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, భూసేకరణ నిమిత్తం జారీచేసిన తుది డిక్లరేషన్‌ను రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment