వరంగల్ నగరం సమీపంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదివారం సందర్శించారు.
ధర్మసాగర్: వరంగల్ నగరం సమీపంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదివారం సందర్శించారు. గోదావరి జలాలను ఆహ్వానిస్తూ ఆయన కొబ్బరికాయ కొట్టారు. అధికారులతో కలసి గోదావరి జలాల పంపింగ్‌ను ఆయన పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఏటూరునాగారం మండలం దేవాదుల నుంచి ఈ నెల11వ తేదీన అత్యవసర పంపింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీటిని పంప్ చేసి అక్కడి నుంచి వరంగల్‌కు నీరందిస్తున్నారు.