
'రాయలసీమకు 80 టీఎంసీలు కేటాయించాలి'
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లో కలపాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది.
అనంతపూర్ టౌన్: పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లో కలపాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 80 టీఎంసీల నికర జలాలను రాయలసీమకు కేటాయిస్తూ ప్రభుత్వం వెంటనే ఒక జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని 12 నెలల్లో పూర్తి చేయాలన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 12, 13 తేదీల్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అఖిలపక్షం తెలిపింది. ఈ అఖిల పక్ష సమావేశంలో సీపీఐ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.