
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జలదీక్ష చేపట్టేందుకు వెళ్తున్న జగ్గారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ జిల్లాకు గోదావరి జలాలను తరలించే వరకు తాను నిరహార దీక్ష చేపడతానని ఇటీవల ఆయన ప్రకటించారు. అందులోభాగంగా సోమవారం జలదీక్ష చేపట్టడానికి వెళ్తుండగా జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.