
పూజలు చేస్తున్న మున్సిపల్ పాలకవర్గం
మెదక్/మెదక్ మున్సిపల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంతో వీధివీధినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. చవితిని పురస్కరించుకుని సోమవారం మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. పట్టణంలోని వీధుల్లో యువజన, కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాల్లో భారీ విగ్రహలను ఏర్పాటు చేశారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంతో పాటు మున్సిపల్ కాంప్లెక్స్‌లో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు.
మున్సిపల్ చైర్మెన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మెన్ రాగి అశోక్, పలువురు కౌన్సిలర్లు పూజలు చేశారు. అనంతరం మట్టి విగ్రహాలు తయారు చేసిన శ్రీకాంత్‌ను సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, చంద్రకళ, ఆర్‌కే శ్రీను, గాయత్రి, ఐతారం నర్సింలు, నాయకులు సాయిలు, ముత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.