
కళాజ్యోతి గణేశ్ మండలి వద్ద లక్షపుష్పార్చన
- వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
- గణనాథునికి లక్ష పుష్పార్చన
- జోరుగా అన్నదాన కార్యక్రమాలు
మెదక్ మున్సిపాలిటీ: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మెదక్ పట్టణంలోని పలు వీధుల్లో ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద ప్రజలు ప్రతినిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. గణనాథునికి నైవేద్యాన్ని సమర్పిస్తూ..తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పెద్ద బజార్‌లోని కళాజ్యోతి గణేశ్ మండలి వద్ద లక్షపుష్పార్చన చేశారు.
జంబికుంటలోని శ్రీ సూర్యగణేశ్ మండలి వద్ద గణపతిహోమం నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మధు, గంగాధర్, కృష్ణయాదవ్, ఆనంద్, విక్రమ్, శ్రీధర్, బాబు, సంతోష్, సంగమేశ్వర్, ప్రభు, రాజేష్, రవీందర్, శ్రీకాంత్‌తోపాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జోరుగా అన్నదాన కార్యక్రమాలు
పట్టణంలోని పలు వినాయక మండపాల వద్ద జోరుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఫతేనగర్‌లోని శివరాజ్ గణేశ్ మండలి ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆజంపురాలోని చైతన్య బాల గణేశ్ మండలి వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు కాసకిట్టు, జగన్, సైదులు, వంశీ, వెంకట్, నరేష్, యాదగిరి, భూదేష్, శ్రీను, రాము, నాగరాజు, బాలరాజ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.